Home » , » జనవరి 20 నుంచి సెల్‌నెంబరు మారదు!

జనవరి 20 నుంచి సెల్‌నెంబరు మారదు!

Written By Mr.D.S on Thursday, November 25, 2010 | 9:41 PM

దేశంలోని సెల్ వినియోగదారులకు శుభవార్త! 

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్ పీ)సేవలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. గురువారం హర్యానాలో తొలిసారిగా ఈ సేవలను కేంద్ర టెలికం శాఖ మంత్రి కపిల్ సిబాల్ ప్రారంభించారు. 
మొబైల్ నంబర్ మార్చకుండానే వినియోగదారులు, తమ ఆపరేటర్లను మార్చుకునే సౌలభ్యాన్ని ఈ సేవలు ఉపకరిస్తాయి. ఎంఎన్‌పీ సర్వీసులను అందుబాటులో కి తెచ్చేందుకు రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఇన్నాళ్లకు కొలిక్కి వచ్చాయి.
 ఈ నేపథ్యంలో.. వచ్చే ఏడాది జనవరి 20 నాటికి దేశవ్యాప్తంగా ఎంఎన్‌పీ సేవలను అందించనున్నట్టు డాట్ తెలిపింది.

Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger