Latest Post

అమెరికాను వణికిస్తున్న ఆ ఒక్కడు !

Written By Mr.D.S on Sunday, December 5, 2010 | 9:39 PM

ఒక్కడు.. ఒక్కడు..ఒక్కడు చాలు...ఒక్కడే..ఆ వ్యక్తికి ఇలాంటి విశేషణాలు ఎన్నైనా చేర్చవచ్చు. అలాంటి వ్యక్తి ఆయన. ప్రస్తుతం అమెరికా మోస్ట్‌ వాంటెడ్గ జాబితాలో మెదటిస్థానంలో ఉన్నది ఆయనే. అణుయుద్ధానిెకైనా బెదరని అమెరికా ఆ వ్యక్తికి మాత్రం హడలిపోతున్నది. ఏ నిమిషంలో తనకు సంబంధించిన ఏ గుట్టు రట్టు అవుతుందోనని ఆందోళన చెందుతోంది. ఆ వ్యక్తిని ఆచూకీ దొరికితే ప్రాణాలు తీసేందుెకైనా, పాదాక్రాంతం అయ్యేందుెకైనా సిద్ధంగా ఉంది. ఆయనే జులియన్‌ అసాంగే. వికీలీక్స్‌ వెబ్‌సైట్‌ వ్యవస్థాపకుడు. ఇరాక్‌లో అమెరికా సైనికుల అకృత్యాలను బయటపెట్టి సంచలనం సృష్టించిన ఈ వెబ్‌సైట్‌ తాజాగా అమెరికా దౌత్యాధికారుల లేఖలను బయటపెట్టి అమెరికాతో సహా పలు దేశాలను ఇరుకున పెట్టింది.



 ఆ లేఖల్లోని సమాచారం వెల్లడి కావడంతో వివిధ దేశాల మధ్య స్నేహసంబంధాలు తీవ్రంగా ప్రభావితం కావడంతో పాటుగా యావత్‌ ప్రపంచం దృష్టిలో అమెరికా విలన్‌గా ముద్రపడే అవకాశమూ ఉంది.


అంతర్జాతీయ లాభాపేక్ష రహిత మీడియా సంస్థ వికీలీక్స్‌. ఇతరత్రాగా మరెక్కడా లభ్యంకాని సమాచారాన్ని ఇది అందిస్తుంది. 2006లో వికీ లీక్స్‌ వెబ్‌సైట్‌ ఆరంభమైంది. సన్‌షైన్‌ ప్రెస్‌ దీన్ని నిర్వహిస్తోంది. ఉనికి చాటుకోవడానికి ఇష్టపడని వ్యక్తులు వివిధ ప్రభుత్వాల అధికార రహస్యాలను ఈ వెబ్‌సైట్‌ ద్వారా లీక్‌ చేస్తుంటారు. సాధారణం గా ఇవి ప్రభుత్వ సంబంధిత అకృత్యాల కు, అక్ర మాలకు, గోప్యతకు సంబంధించినవై ఉంటాయి. చైనా అసమ్మతివాదులతో పాటు అమెరికా, తైవాన్‌, యూరప్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశా లకు చెందిన జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు వికీలీక్స్‌కు సహకరిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఇంటర్నెట్‌ ఉద్యమకారుడు జులియన్‌ అసాంగే ఈ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తు న్నారు.

2008 ఎకనామిక్‌ మ్యాగజైన్‌ న్యూ మీడియా అవార్డుతో సహా ఇప్పటి వరకూ వికీలీక్స్‌ ఎన్నో అవార్డులు పొందింది. 2009లో సంస్థతో పాటు గా అసాంగే కూడా అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ యూకే మీడియా అవార్డు పొందారు. కెన్యాలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన పత్రాలు, కథనాల ప్రచురణగాను ఈ అవార్డు లభించింది. వార్తల రూపురేఖలను సంపూర్ణంగా మార్చగల శక్తిసామర్థ్యాలు గల వెబ్‌సైట్ల జాబితాలో ఇది మొదటి స్థానాన్ని పొందింది. 2010 మే నెలలో న్యూయార్క్‌ డెయిలీ న్యూస్‌ ఈ జాబితా రూపొందించింది.

బాగా ప్రచారంలో ఉన్న వికీపీడియాకు, వికీలీక్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే, ఆరంభంలో ఇది కూడా వికీ తరహా సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగించింది. ఎవరైనా దేన్నయినా ఎడిట్‌ చేసే వీలుండేది. ఆ తరువాత మాత్రం ఇది సంప్రదాయక వెబ్‌సైట్‌ తరహాలోకి మారింది. నవంబర్‌ నెల నుంచి ఇది అమెరికా దౌత్యవర్గాల సమాచారాన్ని లీక్‌ చేయడం ఆరంభించింది. ఈ సమాచారం వెల్లడి కావడంతో ఇతర దేశాలతో తమ సంబంధాలు ఎక్కడ దెబ్బ తింటాయోనని అమెరికా ఆందోళన చెందడం ఆరంభించింది. 2010 ఆరంభం వరకూ వికీలీక్స్‌ నిధుల కొరతను ఎదుర్కొంది. ఇప్పుడు ఆ సమస్య లేదని ఆ సైట్‌ పేర్కొంది. ఈ సంస్థలో ఐదుగురు ఫుల్‌టైమ్‌ సిబ్బంది ఉన్నారని, 800 మంది వివిధ రకాలుగా స్వచ్ఛందంగా సహకరిస్తారని తెలిపింది. సంస్థ వ్యయం ఏటా రూ. కోట్లలో ఉన్నప్పటికీ, అసోసియేటెడ్‌ ప్రెస్‌, లాస్‌ఏంజెల్స్‌ టైమ్స్‌ లాంటి సంస్థలెన్నో దీనికి ఆర్థికంగా సహకరిస్తున్నాయి.


ప్రభుత్వాల దాడులు

జర్మన్‌ వికీలీక్స్‌ డొమైన్‌ నేమ్‌ను రిజిష్టర్‌ చేయించుకున్న వ్యక్తిపై జర్మనీ పోలీసులు దాడి చేశారు. యూఆర్‌ఎల్‌లో వికీలీక్స్‌ అని ఉన్న ప్రతీ వెబ్‌సైట్‌ను చైనా ప్రభుత్వం సెన్సార్‌ చేసేది. మారుపేర్లతో ఇది చైనాలోనూ దర్శనమిస్తోంది. చైనాలో వికీలీక్స్‌పై సెన్సార్‌కు యాహూ సెర్చ్‌ కూడా సహకరించడం గమనార్హం.
ఆస్ట్రేలియాలో దీన్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే ప్రయత్నాలు జరిగాయి. థాయ్‌లాండ్‌లో ఇది సెన్సార్‌కు గురవుతోంది. అమెరికాలోని లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌లో ప్రస్తుతం దీన్ని బ్లాక్‌ చేశారు. వికీలీక్స్‌పై ఉగ్రవాద ముద్ర వేసేందుకు పీటర్‌ కింగ్‌ లాంటి అమెరికన్‌ సెనేటర్లు ప్రయత్నిస్తున్నారు. అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్ళ నేపథ్యంలో ఎన్నో సంస్థలు వికీలీక్స్‌కు సహకరించడం మానేశాయి. మనీబుకర్స్‌ లిమిటెడ్‌, డైనమిక్‌ నెట్‌వర్క్‌ సర్వీసెస్‌, అమెజాన్‌, పే పాల్‌, ఫేస్‌బుక్‌ లాంటివి ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్ని తిరిగి సహకరించడం మొదలెట్టాయి. 



  • వికీలీక్స్‌ బయటపెట్టిన లీకుల్లో కొన్ని....

  • american-embassyపాక్‌ సైన్యంచే మానవహక్కుల ఉల్లంఘన
  • గూఢచార విమానాలపై అమెరికా బ్రిటన్‌ల తగవు
  • భారత్‌ దాడి చేస్తే స్పందిస్తామన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ కయానీ
  • ఐరాస అధికారుల వ్యక్తిగత సమాచారం కోరిన సీఐఏ
  • ఆఫ్గాన్‌లో వైఫల్యం చెందామన్న బ్రిటన్‌
  • 26/11 దాడులకు విదేశీ దౌత్యవేత్యలు ఏవిధంగా స్పందించారు
  • భారత్‌కు పాషాను పంపించే ప్రతిపాదనను తోసిపుచ్చిన పాక్‌ ఆర్మీ
  • పుతిన్‌ హయాంలో రష్యాలో జోరందుకున్న ఆయుధాల అక్రమరవాణా, విశ్వరూపం దాల్చిన లంచావతారం
  • పరస్పర విశ్వాసం కోల్పోయిన పాక్‌, అమెరికా
  • భారత్‌-పాక్‌ల మధ్య అణు యుద్ధంపై దౌత్యవేత్తల హెచ్చరిక
  • తనపై కుట్ర లేదా తన హత్య జరుగుతుందని భావించిన జర్దారీ
  • యూరప్‌లో 200 అణ్వాయుధాలు మోహరించిన అమెరికా
  • కాశ్మీర్‌పై త్వరలో ఒప్పందమంటూ 2007లో ముషారఫ్‌ చేసిన వ్యాఖ్యలు
  • అమెరికా సాయాన్ని పక్కదోవ పట్టించిన పాకిస్తాన్‌
  • ప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను పక్కదోవ పట్టిస్తున్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ కయానీ
  • మాదకద్రవ్యాల డీలర్లకు కర్జాయ్‌ క్షమాభిక్ష
  • లీక్‌ అయిన డాక్యుమెంట్లలో పలు చోట్ల ఆస్ట్రేలియా ప్రస్తావన
  • పాక్‌ను సంతృప్తిపరిచేందుకు గాను ఆఫ్ఘన్‌పై సమావేశానికి భారత్‌ను ఆహ్వానించని టర్కీ
  • తాజా లీక్‌లో 3,308 పత్రాలు భారత్‌ లోని అమెరికన్‌ దౌత్య కార్యా లయానికి చెందినవి
  • ముస్లింప్రపంచంలో ఆశలు రేకెత్తించిన ఒబామా:సౌదీ రాజు వ్యాఖ్య
  • ఇరాక్‌లో మృతిచెందిన అమెరికన్ల సంఖ్య అధికారికం కంటే ఎక్కువే
  • ఆప్ఘన్‌ యుద్ధంలో నిజాలు

అంతర్జాతీయ స్థాయిలో అనగనగా ఓ ధీరుడు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వాల్ట్‌డిస్నీ సంస్థతో కలిసి రూపొందిస్తున్న గ్రాఫికల్‌ ఫాంటసీ చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’. సిద్ధార్థ కథానాయకుడు. శృతిహాసన్‌ కథానాయిక. లక్ష్మీప్రసన్న ప్రతినాయిక.


రాఘవేంద్రరావ్‌ తనయుడు ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలను శని వారం ఉదయం పాత్రికేయులకు ప్రదర్శించారు. 



ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కె.రాఘవేంద్రరావు, డిస్నీ ఇండియా ప్రతినిధి మహేష్‌ సామన్‌, శృతిహాసన్‌, లక్ష్మీప్రసన్న, ప్రకాశ్‌, డారామానాయుడు, రాజమౌళి, శ్యామ్‌ప్రసాదరెడ్డి, డి.సురేష్‌బాబు, కె.ఎస్‌.రామా రావు, తదితరులు పాల్గొన్నారు. 


డిస్నీ ప్రతినిధి మహేష్‌ సామన్‌ మాట్లాడుతూ ‘80 ఏళ్ల సినీచరిత్ర కలిగిన డిస్నీ సంస్థ..దర్శకేంద్రుడితో కలిసి చేస్తున్న సినిమా ఇది.దక్షిణ భారత సినిమాలో ఇదేే తొలఇడుగు. ట్రైలర్స్‌లో సాంకేతికత చూశాక మీకే అర్థమవుతుంది. అన్ని వయసులవారు ఆదరించే సినిమాగా నిలుస్తుంది’ అన్నారు. 


శృతిహాసన్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఓ ప్రత్యేక అనుభవం. షూటింగుల్లో సిద్ధర్థ్‌నుంచి చాలా విషయాలు నేర్చుకోగలిగాను’ అన్నారు.

లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ‘ఆస్కార్‌ నటులతో అభినయించినా.. రానంత ఫీల్‌ను ఈ చిత్రంలోని ప్రతినాయిక పాత్ర ఇచ్చింది. ఈ సినిమాలో నటించడానికి ముఖ్యకారణం మా అమ్మగారు. మనోజ్‌, విష్ణుల సహకారం కూడా ఉంది’ అన్నారు. దర్శకుడు ప్రకాష్‌ మాట్లాడుతూ ‘నాన్నగారి నమ్మకం, సాంకేతిక నిపుణుల ప్రతిభ..చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లాయి’ అన్నారు. వక్తలు మాట్లాడుతూ ‘ట్రైలర్స్‌ మెస్మరైజ్‌ చేస్తున్నాయ’న్నారు

రష్యా, ఖతర్‌లకు దక్కిన ఫిఫా వరల్డ్‌ కప్‌ నిర్వహణ

Written By Mr.D.S on Thursday, December 2, 2010 | 8:49 PM

2018, 2022 సంవత్సరాల్లో జరగనున్న సాకర్‌ ప్రపంచ కప్‌ నిర్వహణ హక్కుల్ని రష్యా, ఖతర్‌ దేశాలు సొంత చేసుకున్నాయి. ఈ మేరకు గురువారం జరిగిన ఓటింగ్‌లో ఇంగ్లండ్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, బెల్జియం దేశాల్ని ఓడించి 2018 సాకర్‌ వరల్డ్‌ కప్‌ను నిర్వహించే హక్కుల్ని చేజిక్కించుకోగా.. 2022 లో నిర్వహించే ఫిఫా వరల్డ్‌కప్‌కు జరిగిన ఓటింగ్‌లో అమెరికా, అస్ట్రేలియా, సౌత్‌ కొరియా, జపాన్‌ దేశాల్ని ఓడించి ఖతర్‌ విజయం సాధించింది.
 ఓటింగ్‌కు ముందు జరిగిన ఫిఫా కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో రష్యా ప్రతినిధులు మాట్లాడుతూ సాకర్‌ ప్రపంచకప్‌ నిర్వహణ.. తమ దేశాన్ని మరింత తొందరగా ఆధునికరించేందుకు ఉపకరిస్తుందని తెలిపారు. 

రెబల్‌స్టార్‌తో రెబల్‌ మొదలైంది !


తన పెదనాన్న నట వారసత్వంతోపాటు ‘రెబెల్‌స్టార్‌’ అనే బిరుదును కూడా వారసత్వంగా సంక్రమింపజేసుకుని ‘యంగ్‌ రెబల్‌స్టార్‌’గా పిలువబడే ప్రభాస్‌ ‘రెబల్‌’ పేరుతో రూపొందుతున్న చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్‌-జె.పుల్లారావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు క్లాప్‌నివ్వగా, అనుష్క కెమెరా స్విచ్చాన్‌ చేసారు. లారెన్స్‌ దర్శకత్వంలో ‘మాస్‌’, ‘డాన్‌’ చిత్రాలలో నటించిన హీరో నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలందజేసారు. బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, కెల్లీడార్జ్‌, షాయాజీ షిండే, అలీ, ఎం.ఎస్‌.నారాయణ, జయప్రకాష్‌రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ‘డార్లింగ్‌’ స్వామి, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: తమన్‌.ఎస్‌.

‘పవర్‌’ పీఆర్పీ కోసమేనా ?


prpరెండు కీలక శాఖలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తన వద్దే అట్టి పెట్టుకోవడం వెనుక మర్మం ఏమిటో క్రమంగా వెలుగు చూస్తోంది. పరిసి ్థతులు అనుకూలిస్తే ఏ క్షణంలోనైనా ప్రభుత్వం లో చేరడానికి సిద్ధంగా ఉన్న ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలోకి తీసుకుని ప్రస్తుతం తన వద్ద విద్యుత్‌, వాణిజ్య పన్నుల శాఖలను వారికి కేటాయించవచ్చని తెలుస్తోం ది. వాటితో పాటు మరో రెండు శాఖలను పి ఆర్పీకి ఇవ్వవచ్చని సమాచారం.

ప్రభుత్వంలో చేరితే..పిఆర్పీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు (అనకాపల్లి), కాటసాని రామిరెడ్డి (బనగానపల్లి)లకు విద్యుత్‌, వాణిజ్య పన్నులను కేటాయించవచ్చు. వారిద్దరితో పాటు సి రామచంద్రయ్యతో పాటు మరొకరికి పదవీయోగం దక్కవచ్చని తెలుస్తోంది. సి రామచంద్రయ్య ఎమ్మెల్యే కాకపోవడంతో ఆయనను శాసనమండలికి పంపించి, మరీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లే పోలేదు. కర్నూలుజిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసు కోవాలనే ఉద్దేశంతోనే అదే జిల్లా పాణ్యం శాస నసభ్యుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి మొండిచెయ్యి చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో ప్రైవేటు విద్యుత్‌ కేం ద్రాలు విచ్చలవిడిగా ఏర్పాటు అవుతున్న ప్రస్తుత తరుణంలో విద్యుత్‌శాఖ అత్యంత కీల కంగా మారింది. అయినప్పటికీ..14 నెలలు గా ఈ శాఖను ఎవరికీ కేటాయించలేదు.

2009 లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి, అనంతరం కె రోశయ్య లు కూడా విద్యుత్‌ శాఖను తమ వద్దే అట్టిపె ట్టుకున్నారు. అదే సంప్రదాయాన్ని తాజాగా సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా కొనసాగిస్తుం డటం అనూహ్య పరిణామం. ఇదిలావుండ గా..మంత్రివర్గంలో అంటూ చేరితే తమకు వి ద్యుత్‌, వాణిజ్య పన్నులు, ఆర్థికం, గనుల శాఖ లు తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుందని పిఆర్పీ అధినేత చిరంజీవి బేరం పెట్టినట్లు తెలుస్తోంది.

వ్యూహాత్మక ‘వివేకం’

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో రాజకీయంగా మాత్ర మే దూరమయ్యానని చెప్పుకుంటున్న వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి వ్యూహాత్మకంగా, శరవేగం గా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌కు చెల్లు చీటీ చెప్పి న కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో రెండు పర్యాయాలు సమావేశం అయిన తర్వాత అధిష్ఠానం ఆదే శిస్తే పులివెందుల స్థానం నుంచి జగన్‌పై అయినా పోటీకి సై అన్న వివేకా, ఆ కోణంలోనే వ్యూహాలు పన్నుతున్నట్టు కనిపిస్తున్నది.

జగన్‌కూ, అధిష్ఠానానికీ సయోధ్య కుదిరి స్తానని, సోనియా వద్దకు జగన్‌ను తీసుకు వెళ్ళి సాక్షి కథ నం, ఇతర పరిణామాలపై విచారం వ్యక్తం చేయిస్తానని ఢిల్లీలో వివేకా ప్రకటించి 24 గంటలు కాకుండానే కాంగ్రె స్‌ పార్టీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేసి, తన తల్లిగారైన పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మతో సైతం జగన్‌ రాజీ నామా చేయించి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ చిన్నాన్నను చేరదీయటం ద్వారా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని జగన్‌ ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 



వ్యూహాత్మక భేటీలు...
YS--Vivekanandఈ పరిణామాలన్నీ వెంట వెంట జరిగిన తర్వాత వివేకా నందరెడ్డి పావులు కదపటం మరింత వేగవంతం చేశారు. తాను మంత్రివర్గంలో చేరుతున్నానని ప్రకటించి, అందు కు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. మంత్రి వర్గంలో చేరటానికి ముందు ఇడుపుల పాయలో ఒకసారి, పులి వెందులలో ఒకసారీ జగన్‌తో భేటీ అయ్యారు. బంధు వులు, కుటుంబ మిత్రుల ఒత్తిడితో ఒకసారి, స్వచ్ఛందం గా మరోసారి సమావేశమై వచ్చారు. మళ్ళీ గురువారం అంటే మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత హైదరాబాద్‌లో మరోసారి జగన్‌ను కలుసుకునేందుకు వెళ్ళారు. ఈ మూ డు పర్యాయాలూ జగన్‌ స్వయంగా ఆహ్వానించకుండానే వివేకా వెళ్ళారు. గురువారం భేటీ ముగిసిన సందర్భంగా జగన్‌ మద్దతుదారుల నిరసనను ఎదుర్కున్న వివేకా ఆగ్రహానికి గురై వారిని గద్దించటంతో పాటు మీసాలు మెలి వేశారు.

తప్పు లేదని చెప్పుకునేందుకే...
ysjజగన్‌ పిలవక పోయినా, వయసులో తానే పెద్ద అయి నా, మూడు పర్యాయాలు ఆయన వద్దకు తనంతట తాను గా వివేకా వెళ్ళటంలో పెద్ద వ్యూహమే ఉందన్నది స్పష్టమ వుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. అవసరం అయితే జగన్‌ పైన సైతం పోటీకి సిద్ధమే అని ఇప్పటికే ప్రకటించిన ఆయన, ఒకవేళ అదే పరిస్థితి సంభవిస్తే తన తప్పు ఏమీ లేదని, తాను స్వచ్ఛందంగా వెళ్ళినా నివాసం ముందే అవ మానించారని ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటూ వోటర్ల సానుభూతి సంపాదించే ప్రయత్నం చేసేందుకే ఈ వ్యూ హంతో ముందుకు పోతున్నారని పార్టీ నేతలు కొందరు అంటున్నారు.

ఒకవేళ జగన్‌నే ఢీకొనాల్సి వస్తే పులి వెందుల నియోజకవర్గంలో అత్యంత కీలకమైన, కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి వోటు బ్యాంకు ఉన్న లింగాల, వేముల మండ లాల్లో జనాన్నంతటినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం వివేకా ఇప్పటినుంచే చేస్తున్నారు. ఈ రెండు మండలా ల్లోనూ వివేకా బంధువులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, రాజకీయాల్లో వేరు పడినంత మాత్రాన కుటుంబంలో కలతలు రేగే అవకాశం లేదని వివేకా పదే పదే చెప్పారు. మరోవైపు జగన్‌ సైతం చిన్నాన్నతో తనకు ఎలాంటి జగడం లేదని, ఆయన అంటే ఎప్పటికీ గౌరవమే అని ప్రకటించారు.

‘వ్యవసాయం’ లో సమస్యల సవాళ్ళు !
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ శాఖలు కేటాయించటంతో వారి వారి శాఖల బాధ్యతలు స్వీకర ణలో మంత్రులు ముహూర్తబలాలు వెతుక్కుంటున్నారు. అయితే వ్యవసాయ మంత్రిత్వ శాఖను చేపట్టిన వైఎస్‌ వివేకానంద రెడ్డి గురువారం క్యాబినెట్‌ సమావేశానికి మందే తనశాఖ కార్యక్రమాలపై ఆరాతీశారు. మంత్రి వివేకా మధ్యాహ్నం నేరుగా బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర వ్యవ సాయశాఖ డైరక్టరేట్‌కు వెళ్ళారు. సుమారు గంటన్నరకు పైగా అక్కడే గడిపారు. వ్యవసాయరంగంలో నెలకొన్న సమస్యలను సవాలుగా స్వీకరించారు.

YS--Vivekananda-Reddyతన అన్న దివంగత ముఖ్యమంత్రి వై ఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యవ సాయ రంగంపట్ల ఎనలేని అసక్తి చూపేవారని, ఆయన పెట్టుకున్న ఆశల, ఆశయాలు నెరవేర్చటమే లక్ష్యంగా పని చేయాలని అధికారులను హెచ్చరించారు. ఏదైనా సమస్యలుంటే తనదృష్టికి నిర్బయంగా తీసుకు రావా లన్నారు. బద్దకంతో ఉన్నవారు దాన్ని వదిలించుకోవా న్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవాలని సూచించారు. వ్యవసాయ కుటంబంనుంచి వచ్చిన తనకు వ్యవసాయరంగంలో ఉన్న సమస్యలు , రైతుల కష్టసుఖాలు తెలుసన్నారు.

రైతుకు పంటలసాగుద్వారా ఆదాయాన్ని పెంచినప్పుడే వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతున్నారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలకు అధికారులు వారి వారి స్థాయిల్లో తక్షణం స్పందిచాలని హెచ్చరించారు. ఉదయం మంత్రి వివేకానందరెడ్డిని అభినందించేందుకు పుష్ప గుచ్చాలతో వెళ్ళిన కొద్దిమంది వ్యవసాయశాఖ సిబ్బందిని ఉద్దేశించి తనవద్దకు ఎవరూ రావద్దని సున్ని తంగా పేర్కొన్నారు. తాను వస్తున్నట్టు ముందుగా ఎవ రికీ చెప్పకుండా ఆకశ్మికంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ డైర క్టరేట్‌కు వెళ్ళారు. మంత్రి వచ్చిన సమాచారాన్ని గమ నించిన కమీషనర్‌ సునిల్‌ శర్మ మంత్రిని తన ఛాంబర్‌ లోకి ఆహ్వానించా
రు.

స్పోకెన్‌ ఇంగ్లీషును అందిస్తున్న టాటా డోకోమో

Written By Mr.D.S on Wednesday, December 1, 2010 | 8:57 PM

ఇప్పటికే పలు ఆసక్తికర ఆఫర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న టాటా డోకో మో మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. 

మొ బైల్‌ ద్వారా బేసిక్‌ ఇంగ్లీషు నేర్చుకోవాలనే అకా ంక్ష కలిగిన వారికి ఇంగ్లీషు సీకో పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. 

స్పోకెన్‌ ఇంగ్లీష్ ను అతి సులభంగా నేర్పించాలనే లక్ష్యంతో దీన్ని ప్రవేశ పెట్టి నట్లు డోకోమో తెలిపింది. 

దీనికోసం 529221 నెంబర్‌కు డయల్‌ చేసి ఇంగ్లీషు సీకోకు లాంచ్‌ కావచ్చని, ఆ తర్వాత మనకు ఆంగ్లంలో వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. 

ఈ సౌకర్యాన్ని దేశంలోని తొమ్మిది భాషల్లో అందిస్తున్నారు. వాటిలో హిందీ, బెంగాలీ, ఒరియా, తమిళం, తెలుగు, మల యాళం, కన్నడ, గుజరాతీ, మరా ఠీలు ఉన్నాయి. 
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger