60 గంటల మారణహోమం
175 మంది అమాయకులు హతం
ప్రాణాలకు తెగించిన భద్రతా దళాలు
గుప్పెడుమంది ఉగ్రవాదులు.. దేశ ఆర్థిక గుండెకాయను గుప్పెట పట్టిన రోజు! 60 గంటల పాటు సాగిన మారణహోమం.. 175 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న రోజు! తాజ్ ప్యాలెస్‌పై ఎగసిన మంటలు.. మరో ఆరు ప్రాంతాల్లోనూ పేలిన తూటాలు! దేశాన్నే కాదు.. యావత్ ప్రపంచాన్నే ఉగ్రవాదం నివ్వెరపరిచిన రోజు.. నవంబర్ 26! మరపునకు రాని మహా విషాదం!!
ఉగ్రదాడులు సాగాయిలా...
ఉగ్రదాడులు సాగాయిలా...
- ముంబైలోని 8 ప్రాంతాల్లో 2008 నవంబర్ 26, 27, 28 తేదీల్లో ఉగ్రవాదుల దాడులు
- ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ ప్యాలెస్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా, టైమ్స్ ఆఫ్ ఇండియా రోడ్డులో దాడులు.
- 26/11 - రాత్రి 8 గంటలకు పదిమంది ఉగ్రవాదులు జల మార్గంలో కొలాబా తీరంలోని రెండు వేర్వేరు ప్రాంతాలకు చేరుకున్నారు.
- సీఎస్టీ వద్ద అజ్మల్ కసబ్‌తో పాటు మరో ఉగ్రవాది రాత్రి 9.30కి ఏకేలతో కాల్పులు మొదలుపెట్టారు. 58 మందిని హతమార్చారు. 8 మంది పోలీసులూ మరణించారు.
- అక్కడినుంచి కామా ఆస్పత్రికి వెళ్లి, అక్కడ ఒకరిని చంపేశారు.
- పోలీస్ బాస్ హేమంత్ కర్కరే నేతృత్వంలో ముంబై ఏటీఎస్ సిబ్బంది సీఎస్టీని గాలించారు. కర్కరేతో పాటు విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టేలు కసబ్, ఖాన్‌లను పట్టుకోవడంలో మరణించారు. ఈ క్రమంలో కసబ్ పట్టుబడ్డాడు.
- కొలాబాలోని లియోపాల్డ్ కేఫ్‌పై కాల్పులు జరిపి, 10 మందిని పొట్టనబెట్టుకున్నారు.
- టాక్సీలలో బాంబులు పెట్టి రెండుచోట్ల పేలుళ్లు జరిపారు. మొదటిది 10.40కి విల్లెపార్లెలోను, రెండోది వాడీ బందర్ వద్ద 10.20-10.25 మధ్య జరిగాయి. టాక్సీ డ్రైవర్‌తో పాటు ముగ్గురుమరణించారు.
- తాజ్‌మహల్ ప్యాలెస్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటళ్లపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కాల్పులు, పేలుళ్లు ఈ హోటళ్ల లోపల, బయట కొనసాగాయి. తొలిరోజు రాత్రి అగ్నిమాపక దళ సభ్యులు 200 మంది బందీలను రక్షించారు. తాజ్ హోటల్లోని వసాబీ రెస్టారెంట్ మొత్తం నాశనమైంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితోపాటు మెరైన్ కమాండోలు (మార్కోస్), నేషనల్ సెక్యూరిటీ గార్డులు (ఎన్ఎస్‌జీ) ఈ హోటళ్లను చుట్టుముట్టారు. హెలికాప్టర్ల నుంచి కూడా హోటళ్లపైకి దిగి సాహసోపేతంగా ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. నవంబర్ 29 ఉదయానికల్లా మొత్తం రెండు హోటళ్లలో ఉన్న 29 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఎన్ఎస్‌జీ కమాండో సునీల్‌యాదవ్‌ను కాపాడే యత్నంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ప్రాణాలొదిలారు.
- కొలాబాలోని నారిమన్ హౌస్‌ను ఇద్దరు ఉగ్రవాదులు స్వాధీనంలోకి తీసుకున్నారు. సుదీర్ఘ పోరాటం అనంతరం ఎన్ఎస్‌జీ కమాండోలు వారిని మట్టుబెట్టారు. దాడిలో కమాండో మృతి చెందారు.
- 27వ తేదీ ఉదయానికల్లా ఆర్మీ రంగప్రవేశం చేసింది. ఎట్టకేలకు నవంబర్ 29వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్ఎస్‌జీ కమాండోలు మొత్తం ఆపరేషన్‌ను పూర్తిచేశారు.


Post a Comment