అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొణిజేటి రోశయ్యకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ పునరావాసం కల్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా పనిచేసిన ఆయనను కర్ణాటక గవర్నర్‌గా పంపే అవకాశాలున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. రోశయ్య సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని.. ఆయనకు పొరుగు రాష్ట్ర ప్రథమ పౌరుడి పదవి కట్టబెడితేనే సముచితంగా ఉంటుందని అధిష్ఠానం యోచిస్తోందని కొంత మంది నాయకులు కూడా చెబుతున్నారు.
కర్ణాటక గవర్నర్‌గా రోశయ్య?
Written By Mr.D.S on Wednesday, November 24, 2010 | 8:21 PM
Labels:
రాజకీయం

Post a Comment