తెలుగు తెర పై 3D మాయాజాలం
Written By Mr.D.S on Tuesday, November 30, 2010 | 10:00 PM
అవతార్ సినిమాతో అందరి కళ్ళు 3D సినిమా మీద పడ్డాయి.తెలుగు లో మొదటి డిజిటల్ సినిమా తీసిన దర్శకుడు శివ, చుమంతార్ పేరుతో ఒక 3D సినిమా నిర్మించబోతున్నారు.అలాగే ఆలీబాబా నలబై దొంగలు పేరుతో ఒక 3D సినిమాని నిర్మించబోతున్నారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ "అమ్మ" పేరుతో ఒక 3D హర్రర్ సినిమాని నిర్మించబోతున్నారని సమాచారం.
రజనీకాంత్ , ఐశ్వర్య రాయి ల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బ్లాస్టర్ మూవీ రోబో ని కుడా 3D లో తిరిగి నిర్మించాబోతున్నని వినికిడి.
ఇదే కోవలో తెలుగు లో అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి తనయుడి చిత్రం మగధీర చిత్రాన్ని కుడా 3D లో నిర్మించే అవకాసం లేకపోలేదు.
ఇంకా కమల నటించిన దశావతారం, హ్రితిక్ నటించిన జోద అక్భర్ ,తెలుగు లో భారి విజయాన్ని నమోదు చేసిన అరుంధతి లాంటి సినిమాలను 3D లో కి నిర్మించటం వల్ల ప్రేక్షకుల కు 3D లో మంచి సినిమాలను అందించవచ్చు.
రజని కా౦త్ హీరో గా తన కుమార్తె సౌందర్య నిర్మిస్తున్న ఐన్మతిఒన్ మూవీ సుల్తాన్ ధీ వారియర్ ని 3D లో కి నిర్మించే ప్రయత్నాలు జగుతున్నాయి.
అయితే ఈ 3D సినిమా చూడటానికి ఒక ప్రత్యేకమైన కళ్ళజోడు సాయతోనే చూడగలం.అయితే మనదేశం లో 3D సినిమా నిర్మించే సాహసం చెయ్యటం కష్టమే.ఎందుకంటే ఇది చాలా కర్చుతో కూడుకున్న పని.ఒక సినిమాకి మనదేశం లో అవెరగె టాక్ వచ్చి అంతంత మాత్రం గా ఆడినా ప్రస్తుత ఉన్న కర్చును బట్టి నిర్మాతలకు నష్టాలు రాకుండా బయటపడవచు.అదే సినిమా అంతట మాత్రం గా ఉంటె మాత్రం ఇక బిచాన సర్దుకోవలిసిందే....
ఏది ఏమైనా మనం కుడా 3D సినిమాలను చూసే అవకాశం వస్తుంది.అంత వరకు కాస్త ఒపిక పట్టండి.
Labels:
సినిమాలు

Post a Comment