Home » » జగన్‌ దురుసుతనం.. కంటతడి పెట్టిన వివేకా

జగన్‌ దురుసుతనం.. కంటతడి పెట్టిన వివేకా

Written By Mr.D.S on Tuesday, November 30, 2010 | 9:20 PM

పులివెందుల రాజకీయం రానురాను మలుపులు తిరుగుతూ ఉంది. బాబాయ్‌, అబ్బాయ్‌ల మద్య జరుగుతూ ఉన్న చర్చలు తుది దశకు చేరి విఫలమయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు జగన్‌ రాజీనామా, సీఎం కిరణ్‌ కొలువులో వివేకా మంత్రి పదవి వెరసి వై.ఎస్‌.వివేకా, వై.ఎస్‌.జగన్‌ల మద్య చెలరేగిన చిచ్చు చిలికి చిలికి గాలివానలా ముదిరి ఒకరిమధ్య మరొకరికి వాదులాటలు జరిగి చేయి చేసుకొనేంత వరకు వెళ్లినట్లు సమాచారం. 

మంగళవారం ఉదయం ఎస్టేట్‌కు వచ్చిన వై.ఎస్‌.జగన్‌ పులివెందులలోని వై.ఎస్‌.వివేకాల మధ్య మనస్పర్థలను తొలగించేందుకు కుటుంబసభ్యులు వై.ఎస్‌.వివేకాను ఇడుపులపాయకు వెళ్లవలసిందిగా కోరడం తో వై.ఎస్‌.వివేకా ఇడుపులపాయకు వెళ్లారు. అయితే అక్కడ వై.ఎస్‌.జగన్‌ అతని బాబాయ్‌ వై.ఎస్‌.వివేకాను ఎందుకొచ్చావ్‌ అనడంతో మాట మాట్లాడక మునుపే ఎందుకొచ్చావ్‌ అన్న విషయానికి వై.ఎస్‌.వివే కానందరెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటి బాటపట్టినట్లు సమాచారం.




                                              
తన మాట నెరవేరలేదనే కోపం, తన బాబాయ్‌ మంత్రి పదవి తీసుకొంటున్నాడని తనకు సీఎం పదవి దక్కలేదనే ఆక్రోశంతో వై.ఎస్‌.జగన్‌ వై.ఎస్‌.వివేకాను ఇడుపులపాయ నుంచి బయటికి వెళ్లు అని అన్నట్లు సమాచారం. దీంతో వై.ఎస్‌.వివేకా ఇడుపుల పాయ నుంచి నేరుగా కడపకు వెళ్లారు. అటు నుంచి మళ్లీ పులివెందులకు వచ్చి అన్న ఆశయాన్ని నెరవేర్చేందుకు మంత్రి పదవి తీసుకొంటున్నానన్నారు.

అనం తరం సాయంత్రం 7.30 గంటలకు వారి సమీప బంధువైన సివి సుబ్బారెడ్డి ఇంటిలో వై.ఎస్‌ బంధువులంతా కలిసి వివేకా, జగన్‌ల మధ్య మనస్పర్థలు లేకుండా సయోధ్య కుదిర్చేందుకు చర్చలకు ఇరువురినీ ఆహ్వానించారు. అయి తే ఇందులో జగన్‌ మోహన్‌రెడ్డి మొండి వైఖరి వీడలేదని, దురుసుతనంతో ఆయన బాబాయ్‌ వై.ఎస్‌.వివేకాపై వాగ్వివాదం జరిగి ఒకానొక దశలో చేయి చేసుకునేంత వరకు వెళ్లిందని అక్కడే ఉన్న వివేకా బావ సివి సుబ్బారెడ్డి వారిద్దరి మధ్య సర్ధిచెప్పి వివేకానందరెడ్డిని బయటికి పిలుచుకొచ్చి కారులో ఎక్కించి పం పించి వేశారు.

ఈ సందర్భంలో సివి సుబ్బారెడ్డి ఇది మా కుటుంబ వ్యవహారం దీనిలో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని మీడియాతో అనడం చూస్తుంటే లోపల ఎంత వరకు ఏమి జరిగిందో చెప్పవలసిన అవసరం లేదు. దీంతో వివేకా కంటతడి పెడుతూ వెళ్లిపోయారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger