మంత్రివర్గంలో చేరను: వివేకా
Written By Mr.D.S on Monday, November 29, 2010 | 7:37 PM
రాష్ట్ర రాజకీయాలు చకచకా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పులివెందుల నుంచి అధిష్ఠానం పిలుపు మేరకు వివేకా ఢిల్లీ వెళ్లారు. అక్కడ అధిష్ఠానం భేటీ అనం తరం నేరుగా సోమవారం ఉదయం పులివెందులలోని తన నివా సానికి చేరుకున్నారు. అయితే ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మల రాజీనామాల పరంపర కిరణ్ కుమార్‌రెడ్డి కొలువులో మంత్రిపదవి వెరసీ వై.ఎస్ కుటుంబంలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో ఇటు కార్యకర్తలు, అటు నాయకులు, అభిమానులు సందిగ్ధంలో పడ్డారు. వై.ఎస్. వివేకానందరెడ్డి మంత్రి పదవి తీసుకొంటారని జగన్‌మాట విన లేదని, అందుకే వై.ఎస్.జగన్ తన పదవికి రాజీనామా చేసి ఆయన తల్లి విజయలక్ష్మితో రాజీనామా చేయించారు.
ఇలాంటి పరిణామా ల్లో వై.ఎస్.వివేకా సోమవారం ఉదయం ముందుగా దివంగత ముఖ్యమంత్రి వియ్యంకుడు డాక్టర్ ఈసి గంగిరెడ్డి నివాసానికి వెళ్లి సుమారు అరగంట పాటు చర్చించినట్లు సమాచారం. అనంతరం ఆయన నేరుగా వై.ఎస్.భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో కూడా ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అనం తరం వై.ఎస్ ప్రకాష్‌రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ వై.ఎస్ ప్రతాప్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపద్యంలో వై.ఎస్ కుటుంబ సభ్యులు రాష్ట్ర క్యాబినెట్‌లో చేరవద్దని ఆయనపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
జగన్‌మోహన్‌రెడ్డి బాటలోనే నేను పయనిస్తానేకానీ ఆయనకు వ్యతి రేకంగా నడవనని కుటుంబ సభ్యులతో అన్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఒకతాటిపైకి తెచ్చిన దివంగత నేత వై.ఎస్ కుటుంబ సభ్యులపైనే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అనగ దొక్కేందుకు అన్ని మూలలు మూసివేశారని, ఈ నేపద్యంలో నువ్వు క్యాబినెట్‌కు చేరితే దివంగత నేత వై.ఎస్ ఆత్మ క్షోభిస్తుందని వారు ఆయనకు వివరించినట్లు సమాచారం. ఈ నేపద్యంలో వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు కొంత మేరా తలొగ్గినట్లు సమాచారం.
రాష్ట్ర క్యాబినెట్‌లో చేరే ప్రసక్తే లేదని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యులను అనగదొక్కేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, అందులో నేనెలా క్యాబినెట్‌లో చేరతానని మీరు ఎలా ఊహించారని వివేకా నందరెడ్డి తమ కుటుంబ సభ్యులను ప్రశ్నించినట్లు సమాచారం. మంగళవారం ఇడుపులపాయలో అంతా వై.ఎస్ జగన్‌ను కలిసి చర్చిద్దామని ఆయన వారితో అన్నట్లు తెలుస్తోంది. ఇందుకు వారు సమ్మతించినట్లు సమాచారం. ఏదిఏమైనా వివేకానందరెడ్డి రాష్ట్ర క్యాబినెట్‌లో చేరేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Labels:
రాజకీయం

Post a Comment