Home » » నారా రోహిత్ కొత్త సినిమా!

నారా రోహిత్ కొత్త సినిమా!

Written By Mr.D.S on Thursday, November 25, 2010 | 9:46 PM

'బాణం' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నారా రోహిత్ మరో చిత్రంలో నటించనున్నారు. 'యువత', 'ఆంజనేయులు' వంటి చిత్రాలను రూపొందించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఎస్వీకె సినిమా పతాకంపై వైజాగ్‌కు చెందిన పారిశ్రామిక వేత్త వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "ఓ మంచి సినిమాతో ఈ రంగంలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. పరశురామ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా పరశురామ్, రోహిత్ కెరీర్‌లతో పాటు నా కెరీర్‌లోనూ మైలురాయిగా నిలిచిపోతుంది.


ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం'' అని అన్నారు.


కెమెరా: శ్రీకాంత్, సంగీతం: తమన్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పరశురామ్.

Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger