Home » » ప్రజారాజ్యం ప్రభుత్వంలో చేరుతుందా?

ప్రజారాజ్యం ప్రభుత్వంలో చేరుతుందా?

Written By Mr.D.S on Friday, November 26, 2010 | 9:17 PM

రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజారాజ్యం పార్టీ చేరిక అనివార్యమని ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాల వారీకి మంత్రి పదవులపై చ ర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆ పార్టీ అధినేత చిరంజీవి సహా 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అధిష్టానంపై నేరుగా యుద్ధం ప్రకటించిన జగన్‌కు చెక్‌ పెట్టాలంటే అంతటి ఇమేజ్‌ కలిగిన చి రంజీవి మద్దతు అనివార్యమని ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ వర్గాలు చెపుతున్నాయి. ఈ దిశగా ఎఐసిసి వర్గాలు చేసిన ప్రయత్నాల పట్ల చిరంజీవి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రోశయ్య రాజీనామాకు ముందు రోజు ఢిల్లీలో చిరంజీవి ప్రధాని సహా పలువురు కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిశారు. ఆ రోజు నుంచే చిరంజీవి ప్రభుత్వంలో చేరతారనే ఊహాగానాలు బలంగా విని పించాయి. అయితే అనుకోని పరిస్థితిలో రోశయ్య రాజీనామా చేయడం..

వెనువెంటనే స్పీకర్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. జగన్‌ అనుకూల వర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిథులు కూడా కిరణ్‌కుమార్‌ రెడ్డికి మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజారాజ్యం పార్టీ చేరికపై సందేహా లు నెలకొన్నాయి.అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని కిర ణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో చేరేందుకు ప్రజారాజ్యం నిర్ణయిం చుకున్న పక్షంలో, ఆ పార్టీకి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, ఐదు క్యాబినెట్‌ ర్యాంకులు దక్కవచ్చనేది హైదరాబాదు వర్గాల సమాచా రం. పదవులు తక్కువైనా పార్టీ బలాబలాల ఆధారంగా మంత్రి పదవులు ఖాయమని పిఆర్పీ శ్రేణుల అభిప్రాయం. 

రాష్ట్రంలో హై దరాబాదు, విశాఖపట్టణం తర్వాత విజయవాడ నగరపాలక సం స్థకు అంతటి ప్రాధాన్యత ఉంది. ఇంతటి ప్రాశస్త్యమున్న విజయ వాడ నుంచి ప్రజారాజ్యం పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మూడో ఎమ్మెల్యే కూడా గెలిచే అవకాశం ఉన్నప్ప టికీ..ఆఖరి క్షణంలో రంగంలోకి దిగడం వలన ప్రచార వ్యవధి చాలక స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే విజయవాడ నగరంలోనే ప్రజారాజ్యం పార్టీ కి ప్రజలు బలమైన మద్దతు పలికారు. దీనిని ఉపయోగించుకొని వచ్చే నగరపాలక సంస్థ ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీని పట ిష్టం చేయడం ద్వారా మేయర్‌ పీఠం అధిష్ఠించాలని పిఆర్పీ నేతలు ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

ఇప్పుడు కాంగ్రె స్‌లో చేరడం వలన ఆ కలను సునాయాసంగా సాకారం చేసుకో వచ్చనేది వీరి అభిప్రాయం.దీనిని దృష్టిలో ఉంచుకొని దక్కిన పదవులతో నిమిత్తం లేకుండా నగరం నుంచి ఒకరికి మంత్రి వ ర్గంలో చోటు ఇచ్చేందుకు చిరంజీవి నిర్ణయించవచ్చు. ప్రజారా జ్యం పార్టీకి వచ్చిన మంత్రి పదవులు, ఆయా ఎమ్మెల్యేల దామా షాను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కేందుకు వీలుంటుంది.


తూర్పు నియోజకవర్గం నుం చి ప్రాతినిథ్యం వహిస్తున్న యలమంచిలి రవికి అవకాశం లభించి న పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మె ల్సీ పాలడుగు వెంకట్రావుకు అవకాశాలు తక్కువే. జిల్లాలో ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్య పడదు కాబట్టి పాలడుగును కాంగ్రెస్‌ అధిష్టానం పక్కనబెట్టే అవ కాశం ఉంది. 



యలమంచిలి రవి


ఒకవేళ ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కాం గ్రెస్‌ విముఖంగా ఉంటే రవికి తప్పనిసరిగా మంత్రి పదవి దక్కు తుందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు

కొద్ది రోజుల కింద ట రాష్ట్ర ఆర్యవైశ్య సమ్మేళన్‌ నిర్వహించడం ద్వారా వైశ్య సామా జిక వర్గంలో మంచి గుర్తింపు పొందిన వెలంపల్లి శ్రీనివాసరావుకు కూడా అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. రోశయ్య రాజీ నామాతో ఢీలాపడిన ఆర్యవైశ్యులు వెలంపల్లికి అవకాశం ఇస్తే కొంత ఉపశమనం పొందుతారని పలువురు పేర్కొంటున్నారు. అ యితే కాంగ్రెస్‌లోని కర్నూలు ఎమ్మెల్యే టి.జి.వెంకటేష్‌ తదితరు ల నుంచి వెలంపల్లికి పోటీ ఉంది. 


వెలంపల్లి శ్రీనివాసరావు


అన్ని వర్గాలను సంతృప్తి పరి చేందుకు చిరంజీవి ప్రయత్నించిన పక్షంలో ఆర్యవైశ్యులకు అవ కాశం ఇచ్చారనే క్రెడిట్‌ కొట్టేందుకు వెలంపల్లికి అవకాశం ఇవ్వవ చ్చు. ఏదేమైనా ప్రజారాజ్యం పార్టీ ప్రభుత్వంలో చేరిన పక్షంలో నగరం నుంచి ఇద్దరిలో ఒకరికి అవకాశం ఖచ్చితంగా వస్తుందనే ధీమాను ప్రజారాజ్యం పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger