Home » , » సమయం ఆసన్నం..............

సమయం ఆసన్నం..............

Written By Mr.D.S on Saturday, November 27, 2010 | 9:02 PM

కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై వేటు ఖాయమయిపోయింది. అందులో భాగంగా ముందు రెండు రోజుల్లో షోకాజ్‌ నోటీ సు ఇచ్చేందుకు రంగం సిద్ధమయింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా సంపాదించి ఆర్థికంగా బలోపేతుడయిన జగన్‌ను.. ఇప్పుడు ఉపేక్షిస్తే చివరకు ఆ సంపదతో పార్టీనే శాసించి, పార్టీని నిర్వీర్యం చేసేందుకు సాహిస్తారన్న ఆందోళన నాయకత్వాన్ని పట్టిపీడిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


జగన్‌పై చర్య తీసుకోవాలన్న ఆలోచనకు అసలు కారణం ఆయన సంపదేనంటున్నారు. 

ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పవర్‌ ప్రాజెక్టులతో పాటు, ఇబ్బడిముబ్బడిగా పలు వ్యాపారాల స్థాపన ద్వారా జగన్‌ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్న సమాచారం తెప్పించుకున్న అధిష్ఠానం ఈ దశలో ఆయనను నియంత్రిచకపోతే తన సంపాదనతో మరింత ఎత్తుకు ఎదిగి, చివరకు తననే శాసించే ప్రమాదం ఉందని నాయకత్వం భయపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


ఇటీవలే ముందస్తు ఆదాయపన్ను 86 కోట్లు రూపాయలు చెల్లించిన జగన్‌, దేశంలోని మిగిలిన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని 500 కోట్ల పన్ను చెల్లించినట్లు అధిష్ఠానం దృష్టికి వచ్చిందని పార్టీ వర్గాలు వివరించాయి. 

ఈ నేపథ్యంలో తన సంపద ద్వారా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పార్టీని శాసించే స్థాయికి ఎదిగి, పార్టీ నియమించిన ముఖ్యమంత్రులను ఇబ్బందిపెడుతున్నారని నాయకత్వం గ్రహించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జగన్‌ పార్టీని శాసిస్తుంటే, ఇక సంపద పెరిగితే జగన్‌ హవా ఇతర రాష్ట్రాలకూ పాకే ప్రమాదం ఉందని నాయకత్వం అంచనా వే స్తున్నట్లుతెలుస్తోంది. కేవలం ధన బలంతోనే జగన్‌ తనను సవాలు చేసే స్థాయికి ఎదిగారన్న తీర్మానానికి వచ్చింది.


శరద్‌పవార్‌
జగన్‌ను ఇలానే విడిచిపెడితే.. ఆయన చివరకు మరో ఆంధ్రా శరద్‌పవార్‌లా మారి చివరకు పార్టీ ఉనికికే ప్రమాదంగా పరిణ మిస్తారన్న భయాందోళన కూడా నాయకత్వానికి లేకపోలేదంటున్నారు. మహా రాష్ట్ర కేంద్రంగా మొదట కాంగ్రెస్‌లో ఉంటూ, పార్టీ నాయకత్వంపై తిరుగు బాటు బావుటా ఎగురవేసిన శరద్‌పవార్‌ స్థాపించిన నేషలిస్టు కాంగ్రెస్‌తో అక్కడ కాంగ్రెస్‌ దారుణంగా దెబ్బతింది. చివరకు అదే పవార్‌ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయవలసిన దుస్థితికి చేరింది. 

చక్కెర లాబీ ద్వారా వేల కోట్లు సంపాదించిన పవార్‌, చివరకు ఆ సంపాదనతో పార్టీ స్థాపించి, కాంగ్రెస్‌ను శాసించే స్థాయికి ఎదిగిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంది. జగన్‌ వ్యవహారం ఆవిధంగా కాకూడద న్న పట్టుదలతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దీనికితోడు.. జగన్‌ పార్టీని శాసిస్తూ, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్నప్పటికీ ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం వల్ల.. సోనియాగాంధీ ఒక సాధారణ ఎంపీ అయిన జగన్‌కు భయపడుతున్నారన్న సంకేతాలు వెళ్లడంపైనా నాయకత్వం అప్రమత్తమవుతోంది. ఈ సంకేతాల వల్ల.. దేశవ్యాప్తంగా అగ్రనేతలను అణచివేసిన సోనియాగాంధీ చివరకు జగన్‌కు భయపడుతోంద న్న భావన బలపడుతుందేమోనన్న భయం కూడా జగన్‌కు షోకాజ్‌ ఇచ్చేందుకు ఒక కారణమవుతోంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger