Home » , » పార్టీ కి రాజీనామా చేసిన జగన్!!!!!!!!!!!

పార్టీ కి రాజీనామా చేసిన జగన్!!!!!!!!!!!

Written By Mr.D.S on Sunday, November 28, 2010 | 11:28 PM



అనుకున్నదే జరిగింది.ఎంతో కాలం గా రాష్ట్రం లో జరుగుతున్న రాజకీయ అనిశ్చితి ఈ రోజు తో ముగిసినట్టే.జగన్ కాంగ్రెస్ పార్టీ సబ్యాత్వానికి మరియు లోక సభ సబ్యతవానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.పార్టీ రాజీనామా లేఖని సోనియా గాంధీ కి , లోక్ సభ సబ్యాత్వానికి రాజీనామా చేస్తూ లోఖ్ సభ స్పీకర్  కి తన రాజినామని సమర్పించారు.


తన తల్లి వై యస్ విజయ లక్ష్మి కుడా పార్టీ నుంచి వైదోలుగున్నట్టు ప్రకటించారు.


ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తన ఫామిలీ ని విడగోట్టట్టానికి ప్రయత్నిస్తున్నదు వల్ల మనస్తాపానికి గురి అయినట్టు చెప్పారు.తన పిన తండ్రి వై యస్ వివేకానందరెడ్డి కి మంత్రి పదవి ఆశ చూపి తనకీ వ్యతిరీకం గా మార్చి తనను పార్టీ నుంచి తీసివీసే కుట్రలు జరుగటం, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ని ఢిల్లీ లో పార్టీ పెద్దలు కలసి చర్చించటం ఇవ్వన్ని ఆయనని పార్టీ నుంచి పంపివేయట్ట్ట్టానికి జరుగుతున్న కుట్రలు అని జగన్ తో ఉంటున్న వారు ఆరోపించారు.


ఇవ్వన్ని చూసి వాళ్ళు వెల్లమనే కంటే తనే పార్టీ నుంచి వెళ్ళిపోవటం మంచిదని బావించిన జగన్ పార్టీ కి తన ఎంపీ సబ్యాత్వానికి రాజీనామా సమర్పించారు.


ముందు నుంచి ఆయనికి పార్టీ లో ఉండటం ఇష్టం లేకపోయినా ఇంకా కొంత కాలం ఆగుతారని బావించారు.అయితే ఆయన కుటుంభంలోని వాళ్ళే ఆయనికి వ్యతిరేఖం గా మాట్లాడేసరికి తనే వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.


మరి ఇప్పుడు ఆయనతో పాటు ఎంత మంది "ఎం.ఎల్.ఎ" లు  బయటికి వెళతారో చూడాలి.దీనిని బట్టి చిరంజీవి అవసరం కాంగ్రెస్ కి ఉంటుంది.


18 మంది MLA లు ఉన్న ప్రజా రాజ్యం పార్టీ కి మంత్రి పదవులు ఆశచూపి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటం కాంగ్రెస్ కు సులభమే అయినప్పటికీ ఇంకా ఎక్కువ మంది MLA రాజినామా చేస్తే కాంగ్రెస్ ఏమ్చేస్తుందో చూడాలి.ఈ మధ్యే KCR కుడా కాంగ్రెస్ కి స్నేహ హస్తం ఇచ్చాడు.ప్రజారాజ్యం వాళ్ళు చాలక పోతే TRS మదతు తీసుకుని ప్రభుత్వాని సంకీర్ణ ప్రభుత్వం లా నదుపవచు.


ఇదంతా కాంగ్రెస్ కి స్వల్పం గా నష్టం కలిగించినప్పటికీ దీర్గకాలం లో రాజకీయ ప్రయోజనాలకు ఇది ఉపయోగపడుతుందని యోచిస్తున్నారు. 


 సొంత పార్టీ పెట్టె యోచనలో జగన్ ఉన్నట్టు ఆయనకీ దగ్గరగా ఉండే కొంతమంది చెపుతున్నారు.అయితే సొంత పార్టీ పెడితే ఎంత వరకు ప్రభావితం చెయ్యగలరో వేచి చుదాల్సిదే.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger