విడాకులు కోరుకుంటున్న సుందరాంగినిలు
Written By Mr.D.S on Sunday, November 28, 2010 | 11:09 PM
వివాహమైన ఏడేళ్లకు కరిష్మాకపూర్ విడాకులు తీసుకోవాలనుకుంటుందంటే అర్ధం చేసుకోవచ్చు.
కానీ, పెళ్లయి ఏడు నెలలనైనా కాకముందే మనీషా కొయిరాలా కూడా తన వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలనుకుంటుందంటే ఎలా అర్ధం చేసుకోవాలి? కనీసం ప్రేమించినన్ని రోజులు, డేటింగ్ చేసినన్ని రోజులు కూడా కాపురం చేయలేకపోవడాన్ని ఎలా సమర్ధించాలి?
2003లో సంజయ్‌కపూర్‌ను పెళ్లి చేసుకున్న కరిష్మాకపూర్ అతనితో ఏడేళ్లు సంసారం చేసి, ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాక, అతడి నుంచి విడిపోవాలని యోచిస్తున్నదని, గత కొంతకాలంగా పుట్టింటిలోనే ఉంటున్నదని తెలుస్తోంది.
ఇక, కేవలం ఆరేడు నెలల క్రితం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న మనీషా కొయిరాలా కూడా తన భర్త నుంచి ఇప్పటికే వేరుపడిపోయిందని, వీలైనంత త్వరలో విడాకులకు దరఖాస్తు చేయాలనుకుంటోందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం
Labels:
సినిమాలు


Post a Comment