గౌహతి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం
Written By Mr.D.S on Sunday, November 28, 2010 | 10:06 PM
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేలో భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 277 పరుగుల విజయంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను 45.2 ఓవర్లలో 236 పరుగులకు కట్టడి చేసి భారత్ విజయం సాధించింది. భారత్ బౌలర్లలో శ్రీశాంత్, యువరాజ్, అశ్విన్‌లు మూడేసి వికెట్లు పడగొట్టారు. నెహ్రాకు ఒక వికెట్ దక్కింది. గుప్తిల్ 30, హౌ 9, విలియమ్‌సన్ 25, స్లైరిన్ 10, ఇలియట్ 5, టేలర్ 66, హాప్కిన్స్ 16, టఫీ 4, హాప్కిన్స్ 16, టఫీ 4, హాష్కిన్స్ 16, మెక్‌కల్లమ్ 35, మిల్స్ 32 పరుగులు చేసి ఔటయ్యారు. మెక్‌కే పరుగులు ఏమీ చేయకుండా నాటౌట్‌గా ఉన్నాడు.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విరాట్ కొహ్లీ 105 సెంచరీతో రాణించాడు. యువరాజ్ 42, గంభీర్ 38, కివీస్ బౌలర్లలో మెక్‌కే 4, మిల్స్ 3, టఫీ 2 వికెట్లు పడగొట్టారు.
Labels:
ఆటలు

Post a Comment