Home » » మిజోరమ్‌ ప్రజల ఔదార్యం

మిజోరమ్‌ ప్రజల ఔదార్యం

Written By Mr.D.S on Sunday, November 28, 2010 | 10:26 PM



 తాము తింటూ తోటివారికి పెట్టేవారిని ఉన్నతులంటారు, తమ తిండి తమ కోసమేనన్న స్వార్థ మనస్తత్త్వం కలవారు మధ్యములుకాగా, ఇతరుల తిండిని లాగుకొని తినేవారిని నీచులుగా పెద్దలంటారు... మిజోరమ్‌ రాష్ట్రం ప్రజలు ఈ తరహాలో ఉన్నతులకిందే లెక్క. 


ఇక్కడి మహిళలు ప్రతీరోజు తలా పిడికెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఒక డబ్బాలో నిలువచేస్తారు. ఈ డబ్బాను ‘భూహ్‌ఫెయితామ్‌ భావ్మ్‌’ గా పిలుస్తారు. ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని స్థానిక చర్చి ప్రతి పక్షం రోజులకు సేకరించి ప్రజలకు తక్కువధరలో అమ్ముతోంది. ఈ విధంగా పేదలకు సహాయంచేసిన సంతృప్తిని అక్కడి ప్రజలు పొందుతున్నారు.


 ఈ పద్ధతిని 1910 సంవత్సరంలో బ్రిటిష్‌ మిషినరీకి చెందిన డి.ఈ. జోన్స్‌ భార్య , ఒక ఖాసీ తెగకు చెందిన మహిళ ప్రారంభించారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger