లావు తగ్గిన ముమైత్‌ఖాన్
Written By Mr.D.S on Sunday, November 28, 2010 | 10:35 PM
హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేసేంత స్థాయికి ఎదిగిన ముమైత్‌ఖాన్‌కు ప్రస్తుతం తెలుగులో మార్కెట్ పెద్దగా లేదు.
షకీలా, నమిత వంటి లావాటి సెక్స్‌బాంబ్‌ల్ని ఆదరించిన విశాల హృదయులైన తెలుగు ప్రేక్షకులు తనను ఎందుకు ఆదరించరులేనన్న అతి విశ్వాసంతో తన ఫిగర్‌ను మెయింటైన్ చేయడంలో అలక్ష్యం వహించడం ముమైత్ పాలిట శాపమైపోయింది.
సినిమా సినిమాకు తన శరీరంలో కేలరీలు పెంచేసుకుంటూ చివరికి సినిమా చాన్సులు కోల్పోతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ముమైత్‌ఖాన్ ప్రమాదాన్ని పసిగట్టింది. ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పూర్వ వైభవం పొందలేకపోయినా, వ్యాంప్ క్యారెక్టర్స్ చేయడానికి, టీవీల్లో డాన్స్ ప్రోగ్రామ్స్‌కు జడ్జిగా వ్యవహరించడానికయినా తన శరీరాన్ని నాజూకుగా ఉంచుకోవడం అవసరమని రియలైజ్ అయిన ముమైత్‌ఖాన్.. తన బాడీలో పెరిగిపోయిన, పేరుకుపోయిన అదనపు కేలరీలకు వీడ్కోలు పలికింది. మరి, ఇప్పుడైనా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి!
Labels:
సినిమాలు


Post a Comment