Home » » ఒకే టైటిల్‌తో రెండు చిత్రాలు

ఒకే టైటిల్‌తో రెండు చిత్రాలు

Written By Mr.D.S on Saturday, November 27, 2010 | 8:41 PM

ఈ మధ్య టాలీవుడ్‌లో టైటిల్స్‌ విషయంలో చాలా హాట్‌ హాట్‌ గొడవలు జరుగుతున్నాయి. అవికూడా ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీలో భాగం అయిపోతున్నాయి అని ప్రేక్షకులు అలవాటుపడిపోతున్నారు. 

ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అలాంటి గొడవలు మొదలయ్యేలా కనిపిస్తోంది. అదీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలలో కావడం గమనార్హం. 

‘మై బ్రదర్స్‌ వైఫ్‌’ 

‘కైట్స్‌’ చిత్రంలో హాట్‌హాట్‌గా నటించిన బార్బారామోరి నటించిన కొన్ని హాలీవుడ్‌ సినిమాలను బాలీవుడ్‌లో డబ్‌చేసి వదులుతున్నారు నిర్మాతలు. అలా కొత్తగా ‘మై బ్రదర్స్‌ వైఫ్‌’ అనే చిత్రం రాబోతోంది.

 ‘మేరే బ్రదర్‌ కె దుల్హన్‌’


కత్రినాకైఫ్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక యశ్‌రాజ్‌ చిత్రం కూడా ఇంచుమించు అదే అర్థం వచ్చేలా హిందీలో ఉంది. ‘మేరే బ్రదర్‌ కె దుల్హన్‌’ ఆ చిత్రం టైటిల్‌. కథ విషయంలో కూడా రెండు చిత్రాలలో కాన్సప్ట్‌ కూడా అదేనని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

 అయితే ఆ విషయాన్ని యశ్‌రాజ్‌ ఫిలింస్‌ వర్గాలు ఖండిస్తున్నాయి. తమ చిత్రానికి ఆ డబ్బింగ్‌ చిత్రానికీ ఏ మాత్రం సారూప్యం లేదంటున్నాయి. 

వీరి వాదనలు ఎలా ఉన్నా మొత్తానికి ఈ రెండు చిత్రాలకూ ఈ రకంగా పబ్లిసిటీ మాత్రం రావడంతో బార్బారా ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. ఈరకంగా అయినా తన చిత్రం నలుగురి నోళ్లలో నానుతోంది కదా అంటోందట తెలిసిన వాళ్ల దగ్గర!
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger