ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై పేటెంటీ ఎవరికి? తాజాగా పార్టీ నుంచి నిష్ర్కమించిన ఆయన వారసుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికా? లేక వైఎస్‌ను రెండుసార్లు సీఎంగా ప్రతిష్ఠింపచేసిన కాంగ్రెస్ పార్టీకా? ఈ ఇద్దరిలో ఎవరు వైఎస్ పేరును సమర్థవంతంగా వాడుకుంటారు? ప్రజలు ఎవరిని వారసుడిగా భావిస్తారు? .
తాజాగా అన్ని వర్గాల్లో మొదలయిన సందేహాలివి.గతంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామా ల్లో కూడా దాదాపు ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. అయితే ఆ రెండు పరిణామాలు కుటుంబనేపథ్యంలో జరగగా, పార్టీ పరమైన పేటెంటీ విషయంలో మాత్రం వివాదం సాగింది. తమిళనాడులో అన్నాడిఎంకె వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ మృతి చెందిన తర్వాత ఆయన భార్య జానకీ రామచంద్రన్, అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత మధ్య అన్నాడిఎంకె పార్టీతో పాటు ఎంజీఆర్‌పై పేటెంటీ పోరు జరిగింది. చివరకు అది జయలలిత పరమయింది.
ఆ తర్వాత మన రాష్ట్రంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మృతి చె ందిన తర్వాత పార్టీపై పేటీంటీ పోరు జరగగా, చివరకు దానిపై పేటెంటీ చంద్రబాబునాయుడుకే దక్కింది. అంతకుముందు ఎన్టీఆర్ జీవించిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారికంగా బాబుకే దక్కింది. అయితే టీడీపీపై పేటెంటీ, ఎన్టీఆర్ వారసుడిగా ప్రజలు ఆయన ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతిని కాకుండా, అల్లుడు చంద్రబాబునే గుర్తించారు. ఇప్పుడు అలాంటి పేటెంటీ పోరు కాంగ్రెస్‌లో వైఎస్‌పై మొదలవడం ఆసక్తి కలిగిస్తోంది.
తాజాగా తన రాజీనామా లేఖలో జగన్ పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే.. జగన్ తన తండ్రిపై పూర్తి పేటెంటీ హక్కు తనకే అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన తన త ండ్రి మృతి అనంతరం ఆయన ఫొటోలు కూడా పెట్టలేదని, ఆయనను అవమానిస్తున్నా కాంగ్రెస్ నాయకత్వం మౌనంగా ఉందని పేర్కొనడం చూస్తే.. తన తండ్రి వల్ల లబ్థి పొందిన కాంగ్రెస్ పార్టీ చివరకు వైఎస్ కుటుంబాన్నే అవమానకర పరిస్థితిలో బయటకు పంపిందన్న జగన్ ఆవేదన ఈ వ్యూహంలో భాగమే.

వైఎస్ కోసం మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదుకునేందుకు తాను చేసిన ఓదార్పు యాత్రను కాంగ్రెస్ అడ్డుకుందన్న ఆరోపణలు పరిశీలిస్తే.. తన తండ్రి పథకాలతో పాటు, దాని వల్ల వచ్చిన కీర్తి ప్రతిష్ఠలు వారసత్వంగా తనకే సంక్రమిస్తాయన్నట్లుగానే భావించవలసి ఉంది. అదీగాకుండా తండ్రి మృతి చెందిన తర్వాత రాజకీయాల్లో ఆ వారసత్వం సహజంగా తనయులకే దక్కుతుంటుంది. ప్రధానంగా.. జగన్‌కు ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది.
వైఎస్ మృతి చెందిన తర్వాత కొనసాగిస్తోన్న ఓదార్పు యాత్ర కేవలం వైఎస్ మృతి చెందిన వార్తను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించేందుకే ఏర్పాటుచేశారు. ఆ సభల్లో ఆయన వైఎస్ పేరు తప్ప మరెవరి పేర్లూ ప్రస్తావించలేదు.
అయితే.. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా వైఎస్‌పై పేటెంట్ కోసం ప్రయత్నిస్తుండటం ఆసక్తి లిగిస్తోంది. వైఎస్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రి చేయడమే కాకుండా, ఆయనకు ఏ ముఖ్యమంత్రికీ ఇవ్వనన్ని పూర్తి అధికారాలు ఇచ్చామన్న విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ చెబుతోంది. అదేవిధంగా.. కాంగ్రెస్ పార్టీ వైఎస్‌కు సీఎంగా అవకాశం ఇచ్చినందు వల్లే ఆయన అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలిగారని వాదిస్తోంది.

దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ లేనివిధంగా వైఎస్ మరణాంతరం ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని గుర్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించినందున, ఆయన చివరి వరకూ పార్టీలోనే కొనసాగినందున వైఎస్‌పై పేటెంటీ పార్టీకే చెందుతోందని వాదిస్తోంది. ఈ వ్యూహంతోనే.. భవిష్యత్తులో కూడా రాజశేఖరరెడ్డి చిత్రాలను ప్రభుత్వ కార్యకమ్రాలు, ప్రచారానికి వాడుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

Post a Comment