Home » » వై ఎస్ ఆర్ , ఎన్ టి అర్ కంటే గొప్పవాడా?

వై ఎస్ ఆర్ , ఎన్ టి అర్ కంటే గొప్పవాడా?

Written By Mr.D.S on Sunday, November 21, 2010 | 2:27 AM






ఎన్ టి అర్, వై ఎస్ ఆర్  ఈ రెండు పేర్లు వినని తెలుగు వాడు ఉండదు.ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న రెండు ప్రదాన రాజకీయ పార్టీలు ఈ రెండు పెర్లుతోనే బ్రతుకుతున్నై మరి.


ఒకరు సినిమాల్లో మెగాస్టార్ గా ఉండి సొంతగా పార్టీ పెట్టి తక్కువ సమయంలోనే అధికారాన్ని కైవసం చేసుకుని రాజకీయాల్లో కుడా తనదైన ముద్ర వేసాడు.


ఇంకొకరు మొదటి నుంచి రాజకీయల్లోనే ఉంటూ  జనం అభిమానాన్ని పొందారు.అయితే వై ఎస్ ఆర్ మరణించిన తరువాత కాంగ్రెస్ కి ఐకాన్ లా వై ఎస్ ఆర్ మారారు.ఈ సందర్భం లో అయన చేసిన అభివ్రుది కుడా చెప్పుకోవాలి.
వై ఎస్ ఆర్ చేసిన అభివృద్ధి సామాన్య జనాలకు సైతం మెప్పించై.ఎన్ టి అర్ మరణించి చాలా కాలం అయ్యింది .మనిషికి మరుపు అనేది సహజం.ఇప్పుడు వై ఎస్ ఆర్ .ఎవరికి ఉన్న అభిమానాన్ని బట్టి ఎవరికీ వారే గొప్పవాళ్ళు.


అయితే వై ఎస్ ఆర్ మరణం సహజం గా జరుగలేదు.ఇటువంటి సందర్బాలలో జనంలో ఉన్న అభిమానం ఎక్కువ అవుతుంది.అయన చేసిన అబివ్రుది చెప్పుకుంటూ కీర్తిస్తారు.అంతే కాకుండా వై ఎస్ ఆర్ ఒక  సి .ఎం గా అధికారంలో ఉంటూ మరణించారు.అధికారపక్షంలో ఉన్నారు కాబట్టి పార్టీ అంతా కోల్పోయినట్టు సామాన్య జనాలు ఫీల్ అవుతారు.కాంగ్రెస్ అంటే మొదటిగా గుర్తుకోచేది వై ఎస్ ఆర్ అని సామాన్య ప్రజల్లో నానుకుపోతుంది. అదే వై ఎస్ ఆర్ విషయం లో కూడా జరిగుంది.


ఎన్ టి అర్ మరణం సహజం గానే వ్రుధప్య వయసులో జరిగింది.అప్పటికి ఆయన అదికారం లో లేరు.అయితే ఆయన మరణించినపుడు బాధపడని తెలుగువాడు లేదు.ఇప్పటికి చాలా కాలం అయ్యినది.మనిషికి మరపు సహజం కాబట్టి అప్పుడు ఆయనతో ఉన్నవారు ఇప్పుడు కూడా ఆయనితో ఉండాలని లేదు.


ఇక్కడ ఎవరు గొప్ప అనేది చెప్పటం ఎవరికీ వీలు కాదు.ఎందుకంటే ఇద్దరు చేసిన మంచి పనులు వారిని ఇంకా మన మద్య వారిని బ్రతికి ఉంచాయి.మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ ఇద్దరు గొప్ప నాయకులను కోల్పోయింది.
Share this article :

+ comments + 1 comments

November 21, 2010 at 4:24 AM

Nijamee idharu goppavaalle..evari kante evaruu goppavaallu kaadhu...

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger