సూపర్ స్టార్ రజని కాంత్. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు . భారత దేశం లో ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరు మాత్రమె కాదు, అతని కీర్తి దేశ విదేశాలలో మార్మోగుతుంది.కారణం అతను నిటించిన మూవీ రోబో . మన దేశంలో సినిమాల్లో సూపర్ స్టార్స్ గా వెలుగొంది రాజకీయాల్లోకి వచ్చి అధికారం సాధించటం కొత్త కాదు. అదే దారిలో వచ్చిన తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి ఓటమి ఎదుర్కున్నాడు. కారణాలు ఇక్కడ అప్రస్తుతం.
అయితే ఇదివరకు లా సినిమా హీరోస్ ని రియల్ హీరోస్ గా భావిస్తూ వాళ్ళు రమ్మంటే వచ్చేసే పరిస్తితి ఇప్పుడు ఉందా?
రజని ఆలస్యం చెయ్యటానికి చిరంజీవి ఓటమి కూడా ఒక కారణమా?
రాజకేయల్లోకి వస్తున్నారా అని తన గురువు బాలచందర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో దేవుడు ఆదేశిస్తే వస్తానంటూ పరోక్షంగా ఎంట్రీ కి సిధం గా ఉన్నారని తెలుస్తుంది.అయితే ఇప్పటి వరకు ఉన్న పార్టీలు వదిలేసి తన దగ్గరికి వచేస్తారా.రజని ని రాజకీయాల్లోకి సూపర్ స్టార్ ని చేస్తారా అనేది ప్రజలే తేల్చాలి.
ఇప్పుడు మనదేశం లో ఉన్న సూపర్ స్టార్స్ అమితాబ్ , చిరంజీవి , మమ్ముట్టి , రజని ముఖ్యమైన వాళ్ళు.వీరిలో ఇప్పటికే రాజకీయాల్లో చేదు అనుభవం ఎదురైనా వారిలో అమితాబ్ , చిరు ఉన్నారు. మరి రజని స్టైల్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
ముందు నుంచే కంట్రోల్ చేయ్యతానికన్నట్టు తమిళ నాడు ముఖ్యమంత్రి రజని కాంత్ తమిళ్ వారు కాదు అంటూ ఆ మధ్య ప్రకటించారు.అసలే మన తమిళ తంబిలకు ప్రాంతేయ అభిమానం ఎక్కువ.ఇప్పుడున్న రాజకియలను తట్టుకుని రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటారో లేక చిరు లా ఇంకో అయిదు సంవత్సరలంటూ వేచి చూసే పరిస్తితి తెచుకుంటారో వేచి చూడాలి.


Post a Comment