ఒక్కడు.. ఒక్కడు..ఒక్కడు చాలు...ఒక్కడే..ఆ వ్యక్తికి ఇలాంటి విశేషణాలు ఎన్నైనా చేర్చవచ్చు. అలాంటి వ్యక్తి ఆయన. ప్రస్తుతం అమెరికా మోస్ట్ వాంటెడ్గ జాబితాలో మెదటిస్థానంలో ఉన్నది ఆయనే. అణుయుద్ధానిెకైనా బెదరని అమెరికా ఆ వ్యక్తికి మాత్రం హడలిపోతున్నది. ఏ నిమిషంలో తనకు సంబంధించిన ఏ గుట్టు రట్టు అవుతుందోనని ఆందోళన చెందుతోంది. ఆ వ్యక్తిని ఆచూకీ దొరికితే ప్రాణాలు తీసేందుెకైనా, పాదాక్రాంతం అయ్యేందుెకైనా సిద్ధంగా ఉంది. ఆయనే జులియన్ అసాంగే. వికీలీక్స్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు. ఇరాక్‌లో అమెరికా సైనికుల అకృత్యాలను బయటపెట్టి సంచలనం సృష్టించిన ఈ వెబ్‌సైట్ తాజాగా అమెరికా దౌత్యాధికారుల లేఖలను బయటపెట్టి అమెరికాతో సహా పలు దేశాలను ఇరుకున పెట్టింది.
ఆ లేఖల్లోని సమాచారం వెల్లడి కావడంతో వివిధ దేశాల మధ్య స్నేహసంబంధాలు తీవ్రంగా ప్రభావితం కావడంతో పాటుగా యావత్ ప్రపంచం దృష్టిలో అమెరికా విలన్‌గా ముద్రపడే అవకాశమూ ఉంది.
జర్మన్ వికీలీక్స్ డొమైన్ నేమ్‌ను రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తిపై జర్మనీ పోలీసులు దాడి చేశారు. యూఆర్‌ఎల్‌లో వికీలీక్స్ అని ఉన్న ప్రతీ వెబ్‌సైట్‌ను చైనా ప్రభుత్వం సెన్సార్ చేసేది. మారుపేర్లతో ఇది చైనాలోనూ దర్శనమిస్తోంది. చైనాలో వికీలీక్స్‌పై సెన్సార్‌కు యాహూ సెర్చ్ కూడా సహకరించడం గమనార్హం.
ఆస్ట్రేలియాలో దీన్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే ప్రయత్నాలు జరిగాయి. థాయ్‌లాండ్‌లో ఇది సెన్సార్‌కు గురవుతోంది. అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం దీన్ని బ్లాక్ చేశారు. వికీలీక్స్‌పై ఉగ్రవాద ముద్ర వేసేందుకు పీటర్ కింగ్ లాంటి అమెరికన్ సెనేటర్లు ప్రయత్నిస్తున్నారు. అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్ళ నేపథ్యంలో ఎన్నో సంస్థలు వికీలీక్స్‌కు సహకరించడం మానేశాయి. మనీబుకర్స్ లిమిటెడ్, డైనమిక్ నెట్‌వర్క్ సర్వీసెస్, అమెజాన్, పే పాల్, ఫేస్‌బుక్ లాంటివి ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్ని తిరిగి సహకరించడం మొదలెట్టాయి.

అంతర్జాతీయ లాభాపేక్ష రహిత మీడియా సంస్థ వికీలీక్స్. ఇతరత్రాగా మరెక్కడా లభ్యంకాని సమాచారాన్ని ఇది అందిస్తుంది. 2006లో వికీ లీక్స్ వెబ్‌సైట్ ఆరంభమైంది. సన్‌షైన్ ప్రెస్ దీన్ని నిర్వహిస్తోంది. ఉనికి చాటుకోవడానికి ఇష్టపడని వ్యక్తులు వివిధ ప్రభుత్వాల అధికార రహస్యాలను ఈ వెబ్‌సైట్ ద్వారా లీక్ చేస్తుంటారు. సాధారణం గా ఇవి ప్రభుత్వ సంబంధిత అకృత్యాల కు, అక్ర మాలకు, గోప్యతకు సంబంధించినవై ఉంటాయి. చైనా అసమ్మతివాదులతో పాటు అమెరికా, తైవాన్, యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశా లకు చెందిన జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు వికీలీక్స్‌కు సహకరిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఇంటర్నెట్ ఉద్యమకారుడు జులియన్ అసాంగే ఈ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తు న్నారు.
2008 ఎకనామిక్ మ్యాగజైన్ న్యూ మీడియా అవార్డుతో సహా ఇప్పటి వరకూ వికీలీక్స్ ఎన్నో అవార్డులు పొందింది. 2009లో సంస్థతో పాటు గా అసాంగే కూడా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూకే మీడియా అవార్డు పొందారు. కెన్యాలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన పత్రాలు, కథనాల ప్రచురణగాను ఈ అవార్డు లభించింది. వార్తల రూపురేఖలను సంపూర్ణంగా మార్చగల శక్తిసామర్థ్యాలు గల వెబ్‌సైట్ల జాబితాలో ఇది మొదటి స్థానాన్ని పొందింది. 2010 మే నెలలో న్యూయార్క్ డెయిలీ న్యూస్ ఈ జాబితా రూపొందించింది.
బాగా ప్రచారంలో ఉన్న వికీపీడియాకు, వికీలీక్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే, ఆరంభంలో ఇది కూడా వికీ తరహా సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగించింది. ఎవరైనా దేన్నయినా ఎడిట్ చేసే వీలుండేది. ఆ తరువాత మాత్రం ఇది సంప్రదాయక వెబ్‌సైట్ తరహాలోకి మారింది. నవంబర్ నెల నుంచి ఇది అమెరికా దౌత్యవర్గాల సమాచారాన్ని లీక్ చేయడం ఆరంభించింది. ఈ సమాచారం వెల్లడి కావడంతో ఇతర దేశాలతో తమ సంబంధాలు ఎక్కడ దెబ్బ తింటాయోనని అమెరికా ఆందోళన చెందడం ఆరంభించింది. 2010 ఆరంభం వరకూ వికీలీక్స్ నిధుల కొరతను ఎదుర్కొంది. ఇప్పుడు ఆ సమస్య లేదని ఆ సైట్ పేర్కొంది. ఈ సంస్థలో ఐదుగురు ఫుల్‌టైమ్ సిబ్బంది ఉన్నారని, 800 మంది వివిధ రకాలుగా స్వచ్ఛందంగా సహకరిస్తారని తెలిపింది. సంస్థ వ్యయం ఏటా రూ. కోట్లలో ఉన్నప్పటికీ, అసోసియేటెడ్ ప్రెస్, లాస్‌ఏంజెల్స్ టైమ్స్ లాంటి సంస్థలెన్నో దీనికి ఆర్థికంగా సహకరిస్తున్నాయి.

ప్రభుత్వాల దాడులు
జర్మన్ వికీలీక్స్ డొమైన్ నేమ్‌ను రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తిపై జర్మనీ పోలీసులు దాడి చేశారు. యూఆర్‌ఎల్‌లో వికీలీక్స్ అని ఉన్న ప్రతీ వెబ్‌సైట్‌ను చైనా ప్రభుత్వం సెన్సార్ చేసేది. మారుపేర్లతో ఇది చైనాలోనూ దర్శనమిస్తోంది. చైనాలో వికీలీక్స్‌పై సెన్సార్‌కు యాహూ సెర్చ్ కూడా సహకరించడం గమనార్హం.
ఆస్ట్రేలియాలో దీన్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే ప్రయత్నాలు జరిగాయి. థాయ్‌లాండ్‌లో ఇది సెన్సార్‌కు గురవుతోంది. అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం దీన్ని బ్లాక్ చేశారు. వికీలీక్స్‌పై ఉగ్రవాద ముద్ర వేసేందుకు పీటర్ కింగ్ లాంటి అమెరికన్ సెనేటర్లు ప్రయత్నిస్తున్నారు. అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్ళ నేపథ్యంలో ఎన్నో సంస్థలు వికీలీక్స్‌కు సహకరించడం మానేశాయి. మనీబుకర్స్ లిమిటెడ్, డైనమిక్ నెట్‌వర్క్ సర్వీసెస్, అమెజాన్, పే పాల్, ఫేస్‌బుక్ లాంటివి ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్ని తిరిగి సహకరించడం మొదలెట్టాయి.
- వికీలీక్స్ బయటపెట్టిన లీకుల్లో కొన్ని....
పాక్ సైన్యంచే మానవహక్కుల ఉల్లంఘన
- గూఢచార విమానాలపై అమెరికా బ్రిటన్‌ల తగవు
- భారత్ దాడి చేస్తే స్పందిస్తామన్న పాక్ ఆర్మీ చీఫ్ కయానీ
- ఐరాస అధికారుల వ్యక్తిగత సమాచారం కోరిన సీఐఏ
- ఆఫ్గాన్‌లో వైఫల్యం చెందామన్న బ్రిటన్
- 26/11 దాడులకు విదేశీ దౌత్యవేత్యలు ఏవిధంగా స్పందించారు
- భారత్‌కు పాషాను పంపించే ప్రతిపాదనను తోసిపుచ్చిన పాక్ ఆర్మీ
- పుతిన్ హయాంలో రష్యాలో జోరందుకున్న ఆయుధాల అక్రమరవాణా, విశ్వరూపం దాల్చిన లంచావతారం
- పరస్పర విశ్వాసం కోల్పోయిన పాక్, అమెరికా
- భారత్-పాక్‌ల మధ్య అణు యుద్ధంపై దౌత్యవేత్తల హెచ్చరిక
- తనపై కుట్ర లేదా తన హత్య జరుగుతుందని భావించిన జర్దారీ
- యూరప్‌లో 200 అణ్వాయుధాలు మోహరించిన అమెరికా
- కాశ్మీర్‌పై త్వరలో ఒప్పందమంటూ 2007లో ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు
- అమెరికా సాయాన్ని పక్కదోవ పట్టించిన పాకిస్తాన్
- ప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను పక్కదోవ పట్టిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ కయానీ
- మాదకద్రవ్యాల డీలర్లకు కర్జాయ్ క్షమాభిక్ష
- లీక్ అయిన డాక్యుమెంట్లలో పలు చోట్ల ఆస్ట్రేలియా ప్రస్తావన
- పాక్‌ను సంతృప్తిపరిచేందుకు గాను ఆఫ్ఘన్‌పై సమావేశానికి భారత్‌ను ఆహ్వానించని టర్కీ
- తాజా లీక్‌లో 3,308 పత్రాలు భారత్ లోని అమెరికన్ దౌత్య కార్యా లయానికి చెందినవి
- ముస్లింప్రపంచంలో ఆశలు రేకెత్తించిన ఒబామా:సౌదీ రాజు వ్యాఖ్య
- ఇరాక్‌లో మృతిచెందిన అమెరికన్ల సంఖ్య అధికారికం కంటే ఎక్కువే
- ఆప్ఘన్ యుద్ధంలో నిజాలు

Post a Comment