దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వాల్ట్‌డిస్నీ సంస్థతో కలిసి రూపొందిస్తున్న గ్రాఫికల్ ఫాంటసీ చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’. సిద్ధార్థ కథానాయకుడు. శృతిహాసన్ కథానాయిక. లక్ష్మీప్రసన్న ప్రతినాయిక.
రాఘవేంద్రరావ్ తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలను శని వారం ఉదయం పాత్రికేయులకు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కె.రాఘవేంద్రరావు, డిస్నీ ఇండియా ప్రతినిధి మహేష్ సామన్, శృతిహాసన్, లక్ష్మీప్రసన్న, ప్రకాశ్, డారామానాయుడు, రాజమౌళి, శ్యామ్‌ప్రసాదరెడ్డి, డి.సురేష్‌బాబు, కె.ఎస్.రామా రావు, తదితరులు పాల్గొన్నారు.
డిస్నీ ప్రతినిధి మహేష్ సామన్ మాట్లాడుతూ ‘80 ఏళ్ల సినీచరిత్ర కలిగిన డిస్నీ సంస్థ..దర్శకేంద్రుడితో కలిసి చేస్తున్న సినిమా ఇది.దక్షిణ భారత సినిమాలో ఇదేే తొలఇడుగు. ట్రైలర్స్‌లో సాంకేతికత చూశాక మీకే అర్థమవుతుంది. అన్ని వయసులవారు ఆదరించే సినిమాగా నిలుస్తుంది’ అన్నారు.
శృతిహాసన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఓ ప్రత్యేక అనుభవం. షూటింగుల్లో సిద్ధర్థ్‌నుంచి చాలా విషయాలు నేర్చుకోగలిగాను’ అన్నారు.
లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ‘ఆస్కార్ నటులతో అభినయించినా.. రానంత ఫీల్‌ను ఈ చిత్రంలోని ప్రతినాయిక పాత్ర ఇచ్చింది. ఈ సినిమాలో నటించడానికి ముఖ్యకారణం మా అమ్మగారు. మనోజ్, విష్ణుల సహకారం కూడా ఉంది’ అన్నారు. దర్శకుడు ప్రకాష్ మాట్లాడుతూ ‘నాన్నగారి నమ్మకం, సాంకేతిక నిపుణుల ప్రతిభ..చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లాయి’ అన్నారు. వక్తలు మాట్లాడుతూ ‘ట్రైలర్స్ మెస్మరైజ్ చేస్తున్నాయ’న్నారు

Post a Comment