రాక్షస బల్లులు ఆవిర్భావానికి కారణం గ్లోబల్ వార్మింగ్
Written By Mr.D.S on Wednesday, December 1, 2010 | 8:39 PM
ప్రపంచదేశాలను ప్రస్తుతం వేధిస్తున్న సమస్య గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే పర్యవసానాలు ఒక పక్క మానవాళిని బెదిరిస్తుంటే, తాజాగా శాస్తవ్రేత్తలు దీనికి సంబంధించి మరో అంశాన్ని వెల్లడించారు.
300 మిలియన్ల సంవత్సరాల కింద రాక్షసబల్లులు భూమిపై అవతరించటానికి భూగోళం వేడెక్క డం కారణం అని సరికొత్త వాదనను లేవదీశారు. డైలీమెయిల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం, లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పరిశోధక బృందం 300 మిలియన్ల సంవత్సరాల కింద భూగోళం వేడక్కడం వల్ల అప్పటివరకు మామూలుగా ఉండే బల్లులు, రాక్షసబల్లులగా రూపాంతరం చెందాయని తెలిపా రు. వీరు కార్భానిఫెరస్ కాంనాటి పరిస్థితులపై పరిశోధనలు సాగించారు. ఉష్ణ మండల అరణ్యాల వాతావరణంలోని పాంజియా అనే సూపర్ కాంటినెంట్ ప్రాంతంలో జీవించిన సరీసృపాలపై అధ్యయనం చేశారు. ఆ సమయంలో భూమి అత్యంత వేడిమితో ఉందని, వర్షారణ్యాలు చిన్న చిన్న ద్వీపాలుగా మారి వాటి చుట్టూ ఎడారులు ఏర్పడ్డాయన్నారు.
ఈ మారిన వాతావరణ పరిస్థితుల కనుగు ణంగా అక్కడ జీవించే బల్లులు ఎడారి వాతావరణానికి అలవాటుపడ్డాయని, కాలక్రమంలో అవే వివిధ రకాల రాక్షసబల్లుల రూపంలోకి మారాయని ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన రాయల్ హాల్లోవేకి చెందిన డాక్టర్ హోవార్డ్ ఫాల్కన్ లాంగ్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వందలకొద్దీ దొరికిన ఈ జీవుల శిలాజాలపై కార్భన్‌డేటింగ్ ప్రక్రియలో పరిశోధనలు చేసి ఈ విషయాన్ని తాము గుర్తించామన్నారు.
నిజానికి 300 సంవత్సరాల కింద భూమి చాలా వేడి గా ఉండేదని, ధృవాల వద్ద ఉన్న మంచు కరిగి అక్కడ విస్తారమైన అడవులు పెరిగా యన్నారు. 80 మిలియన్ల సంవత్సరాలు గడిచిన క్రమంలో 220 మిలియన్ల సంవత్సరాల క్రితం రాక్షసబల్లులు ఏర్పడ్డాయని వీరు తెలిపారు.
Labels:
అంతర్జాతీయం,
విశేషాలు

Post a Comment