Home » » కింగ్ నాగ్ రగడ ఆడియో ఆవిష్కరణ

కింగ్ నాగ్ రగడ ఆడియో ఆవిష్కరణ

Written By Mr.D.S on Tuesday, November 30, 2010 | 9:14 PM



నాగార్జున కథానాయకుడుగా వీరూపోట్ల దర్శకత్వంలో డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న ‘రగడ’ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. హైదరాబాద్‌ శిల్పకళావేదికలో జరిగిన ఆడియో వేడుకలో నాగార్జున, డాఅక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత డి.శివప్రసాదరెడ్డి, వీరూపోట్ల, తమన్‌, నాగచైతన్య, సుమంత్‌, సుశాంత్‌, అఖిల్‌, బ్రహ్మానందం, ఆలీ, కాజల్‌, ఆదిత్య దయానంద్‌, సి.కళ్యాణ్‌, చిత్ర కథానాయికలు...అనుష్క, ప్రియమణి, ఛార్మి తదితరులు పాల్గొన్నారు. ఆడియో తొలిసిడిని ఏఎన్నార్‌ ఆవిష్కరించి నాగార్జునకి అందించారు. అనంతరం ఏఎన్నార్‌ మాట్లాడుతూ ‘యువతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించిన టైటిల్‌ ‘రగడ’. ఈ చిత్రానికి యువసంగీత దర్శకుడు తమన్‌ అద్భుతమైన స్వరాలు అందించారు. నేను సినీపరిశ్రమలోకి రావడానికి కారకుడైన ఘంటశాల బలరామయ్య మనువడు ఇతడే అని ముందుగా తెలియదు. 

Ragada-audio1హుషారైన సంగీతం ఇచ్చిన ఈ కుర్రాడు మరిన్ని విజయాలందుకోవాలి’ అన్నారు. నిర్మాత డి.శివప్రసాద రెడ్డి మాట్లాడుతూ ‘‘నాగార్జునతో 25ఏళ్ల అనుబంధం నాది. తాజాగా ‘రగడ’తో మేం పెద్ద హిట్‌ సాధించబోతున్నాం. వచ్చే సంవత్సరం నాగ్‌ తనయుడు నాగచైతన్యతో కామాక్షి కళామూవీస్‌ సినిమా ఉంటుంది. మరో రెండేళ్లలో అఖిల్‌ కూడా తెరకు పరిచయమవుతాడు. పైరసీనుంచి కాపాడి ‘రగడ’ ని హిట్‌ చేయండి’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ ‘చిత్రీకరణ స్పాట్‌లోనే పెద్దగా మాట్లాడని నిర్మాత..ఇక్కడ మనసు విప్పి మాట్లాడారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేలా సినిమా విజయం సాధిస్తుంది. ఆంధ్రా అంతటా ‘రగడ’ పేరు మారుమ్రోగుతోంది. ప్రభుత్వాలు వచ్చి, వెళుతున్నాయి తప్ప పైరసీపై చేసిందేమీ లేదు. కొత్త ముఖ్యమంత్రి అయినా దానిపై దృష్టి పెట్టాలి’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ ‘ఒక అభిమానిగా నాగార్జున సినిమాలు ఎన్నో చూశాను. ఈ చిత్రం కోసం నాగ్‌ గత చిత్రాల నేపథ్య సంగీతం పరిశీలించి చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. 


Ragada-audioపాటలకు బాణీలు బాగా కుదిరాయి’ అన్నారు. వీరూపోట్ల మాట్లాడుతూ ‘నాగ్‌ హీరోగా నటించిన ‘శివ’, ‘గీతాంజలి’ చాలా ఇష్టమైన సినిమాలు. గీతాంజలి-ఏకంగా 19సార్లు చూశాను. ‘రగడ’కోసం ఒక ప్రేక్షకుడిలా..ఆలోచించి హీరో పాత్రను డిజైన్‌ చేశాను. మాస్‌ పాత్రలో నాగార్జున బాగా నటించారు. ఫైట్స్‌లో ప్రత్యేకంగా కనిపిస్తారు. తమన్‌ సంగీతం సినిమాకి అస్సెట్‌. నిర్మాత సహా సాంకేతికనిపుణుల సహాయంతో చిత్రాన్ని అనుకున్న సమయంలో పూర్తిచేశాం. పెద్ద విజయాన్ని ఆశిస్తున్నాను’ అన్నారు,
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger