ఉదయం ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించిన వివేకా జగన్‌ను కలిసి రెండు నిముషాల్లోనే విసురుగా బయటికి రావడంతో వీరి మధ్య పోరు ప్రారంభమైందని అర్థమైంది. వివేకా రాగానే జగన్ ఏమీ ఇలా వచ్చావు, చేసిందంతా చేసి మళ్లీ ఎందుకు వచ్చావ్, వెళ్లిపో అన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన కడపకు వచ్చి పార్టీకి విధేయుడిగా ఉంటానని చెప్పడానికి జగన్‌ను కలిశానని, తాను అధిష్టానం వ్యక్తినే అంటూ సోనియా గాంధీని క్రీస్తుతో పోల్చి ప్రార్థించాలనడం, తన తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తేల్చి చెప్పడంతో బాబాయ్, అబ్బాయ్‌ల పోరుకు తెరలేసింది.
ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే సాయంత్రం పులివెందులలోని సి.వి సుబ్బారెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులు జగన్, వివేకాల మధ్యన సంధి కుదిర్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. వారు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇక బాబాయ్, అబ్బాయ్‌ల పోరు తప్పదని తేలింది. అంతకు మునుపు కడపలో విలేకరుల సమావేశంలో ఓదార్పు జగన్ వ్యక్తిగతమని చెప్పిన వివేకా వైఎస్‌ఆర్ ఎప్పుడూ పార్టీని వీడాలనుకోలేదని, తనది కూడా అదే బాట అంటూ కుటుంబాన్ని చీల్చే కుటిల రాజకీయాలు కాంగ్రెస్‌పార్టీకి అవసరం లేదని, అధిష్టానాన్నివెనకేసుకు వచ్చారు. దీంతో వీరి కుటుంబంలో పోరుకు తెరలేసిందని చెప్పవచ్చు.
చర్చలు విఫలం, వివేకా హైదరాబాద్‌కు పయనం:
రాష్ట్ర కేబినెట్‌లో చేరాలని ఉవ్విళ్లూరుతున్న వివేకా మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మంత్రివర్గంలో చేరకుండా చేయడంతోపాటు జగన్, వివేకాల మధ్య సయోధ్య కోసం జరిగినచర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చలు పూర్తిగా రహాస్యంగా జరిగినప్పటికి వివేకా మొండిగా అధిష్టానం బాటలో పయనించాలని తేల్చిచెప్పడంతో బంధువులు చేసేదేమీలేక పోయినట్లు తెలుస్తోంది. దీంతో వివేకాను ఆపాలన్న జగన్, విజయమ్మల ప్రయత్నం విఫలమైంది. వివేకా తీరు పట్ల జగన్ పూర్తి అసహనం ప్రదర్శించినట్లు సమాచారం. పులివెందులలోని సిహెచ్‌ఎ చర్చిలో ప్రార్థనల అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
స్వాగతిస్తున్న కాంగ్రెస్‌వాదులు, మండిపడుతున్న జగన్ వర్గీయులు ః
స్వాగతిస్తున్న కాంగ్రెస్‌వాదులు, మండిపడుతున్న జగన్ వర్గీయులు ః
వివేకా కాంగ్రెస్ వెన్నంటే ఉంటానని ప్రకటించడాన్ని రాష్టవ్య్రాప్తంగా కాంగ్రెస్‌వాదులు స్వాగతిస్తున్నారు. జిల్లావాసులైన సీనియర్ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డితోపాటు తులసిరెడ్డి, జెసి దివాకర్‌రెడ్డి, ఎంపి హర్షకుమార్, ఆనం వివేకానందరెడ్డి, పలువురు రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు ఇది మంచి పరిణామమని, పక్కా కాంగ్రెస్ వాది అయినందువల్లనే వివేకా జగన్ తీరును వ్యతిరేకించారని పేర్కొంటున్నారు. అయితే జగన్ వర్గం మాత్రం కేవలం మంత్రివర్గంపై ఆశతో అధిష్టానం మాయలో పడి ఇలా ప్రవర్తిస్తున్నారని, ఇది మహానేత కుటుంబంలోని వ్యక్తి చేయడం దారుణమైన అంశమంటూ మండిపడుతున్నారు.

Post a Comment