Home » » ముఖ్య మంత్రి రోశయ్య ఆర్య,వైశ్య మహా సమ్మేళనం లో పాల్గొనటం సబబేనా?

ముఖ్య మంత్రి రోశయ్య ఆర్య,వైశ్య మహా సమ్మేళనం లో పాల్గొనటం సబబేనా?

Written By Mr.D.S on Tuesday, November 23, 2010 | 2:07 AM

ఒక ముఖ్య మంత్రి ఒక కులానికి సంబంధిచిన సబలో పాల్గొనటం సబబేనా? అంతే కాకుండా నేను మీ వాడిని అంటూ పేర్కొనటం సమంజసమా? అదే సబలో వేరొక పెద్ద మనిషి లేచి మనకులం అంతా మీ వెనకే ఉంది అంటూ పొగడ్తలు.ఒక ముక్యమైన పదవిలో ఉండి అలా ప్రవర్తించటం మన దురదృష్టం.


అసలు కులాలే మరచిపోతున్న ఈ రోజుల్లో ఆయన ఇలా కులాలు ఊసు ఎత్తటం ఎంతవరకు సమంజసం.ఒక ప్రబుత్వ ఉద్యోగి ఏదయిన మతానికి కాని,కులానికి కాని ప్రాతినిద్యం వహించటం నేరంగా బావించాలి.అంటే ఆ పెద్ద మనిషి ఆ ఒక్క కులానికి సంబంధిచిన వాడు.మిగతా కులాలు అతనివి కావా?




రాజశేఖర రెడ్డి ఎపుడైనా రెడ్డి కులానికి సంబంధిచిన సబలలో పాల్గొని నేను మీ వాడిని అని ఉంటే అతనికి ఇప్పుడు ఇంత మంది అభిమానులు ఉండేవారా?


ఎన్.టి.ఆర్  కాని చిరంజీవి కాని ఇలా కులానికి సంబంధిచిన సబలలో పాల్గొన్నారా? ఒక వేల అలా జరిగితే వేరే కులం లో ఉన్న అభిమానులు,శ్రేయోభిలాషులు ఇంకా వారిని అభిమానిస్తారా?


ఇటువంటి ఆలోచనలేని పనులు చెయ్యటం వల్ల ఇంకా కులం అనే వ్యాధి పెరుగుతుంది.ముఖ్య మంత్రి రోశయ్య మా కులం , చిరంజీవి,ఎన్.టి.ఆర్,రాజశేఖర రెడ్డి మా కులం అంటూ చెప్పుకుని తిరిగే కుల గజ్జి పట్టిన వాళ్ళకి  ఇదే ఒక అవకాసం అవుతుంది.


భారత దేశం లో ఈ కుల వ్యాధిని వదల్చటం అంట ఈజీ కాదు.స్వయంగా ఇండియన్ గవర్నమెంట్ ఓట్లు లెక్కింపు కులాల వారిగా జరుగాలంటూ ప్రతిపాదన.ఇదంతా దేశాన్ని , దేశంలో ఉన్న నిమ్న జతులవారిని అబివ్రుది చెయ్యటానికి కాదు.ఈ కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చెయ్యటానికి.


ఇంత జరుగుతున్నా ఎవరూ,ఏ రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదు.ఎందుకని? ఎందుకంటే వాళ్ళు బ్రతికేది కూడా వీటిని అడ్డుపెట్టుకునే.ఒక రాజకీయనాయకుడు ఓటు కావాలని వచినప్పుడు ఏమిచేసావని ఓటు వెయ్యాలి ఎందుకని అడుగలేరు? అతను మా కులం వాడంటూ అతన్ని వెనకేసుకోస్తారు.ఇలానే ఆలోచిస్తే మనం ఇలానే ఉంటాం,మాన్ దేశం ఇలానే ఉంటుంది.


దేశం అబివ్రుది చెందుతుంది అంటున్నాం కానీ ఎవరు అబివ్రుది చెందారు?ఎవరు అభివ్రుది చెందితున్నారు? ఇవ్వన్ని మనకు ఆవసరం  లేని విషయాలు అనుకొని తల దించుకుని వెళ్ళిపోతున్నాం.ఒక మనిషిగా మనం చెయ్యగలిగినది అంతా ఈ భూమి మీద చెయ్యగలగాలి.


ఇప్పటి జనరేషన్ వీటన్నిటికి దూరం జరుగుతున్నా , ఇంకా ఇటువంటి పెద్దవాళ్ళు  వీటిని ఇలానే పెంచుతూ పోతుంటారు.వీటన్నిటికి ఒక ముగింపు కావాలంటే మనలో మార్పు చాలా అవసరం.ఆలోచనలో మార్పు రావాలి,ఇది ఎవరి వాళ్ళ సాధ్యమౌతుంది.మన దేశంలో  యూత్ వల్ల మాత్రమే సాద్యమౌతుంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger