Home » , » ఉగ్రవా స్థావరాలను ధ్వంసం చేయండి

ఉగ్రవా స్థావరాలను ధ్వంసం చేయండి

Written By Mr.D.S on Friday, November 26, 2010 | 9:21 PM

పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయమని ఆ దేశానికి భారత్‌ మరోసారి విజ్ఞప్తి చేసింది. ఆ దుస్సంఘటన జరిగి రెండేళ్ళయిన సందర్భంగా భారత విదే శాంగ మంత్రి ఎస్‌.ఎం. కృష్ణ పాిస్తాన్‌కు ఈ విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కొలంబో వచ్చారు.


పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ భారతదేశ వాణిజ్య రాజధాని ముంబయిపై రెండేళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున (2008 నవంబర్‌ 26న) పాశవికంగా జరిపిన కాల్పుల్లో 166 మంది ప్రాణాలు కోల్పో గా, మరో 300 మంది గాయపడ్డారు. 



పాకిస్తాన్‌లోని ఉగ్ర వాద స్థావరాలను ధ్వంసం చేస్తే 26/11 నాటి బాధితులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయ పడ్డారు. ముంబయిలో ఆటవికంగా జరిపిన ఉగ్రవాదుల కాల్పుల సంఘటనలో అసువులుబాసిన దేశ ప్రజలు, విదేశీ అతిథులకు జాతి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తుందన్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger