Home » , , , » విజయ్‌మాల్యా చేతికి కేప్‌టౌన్‌ బెస్ట్‌ హౌస్‌

విజయ్‌మాల్యా చేతికి కేప్‌టౌన్‌ బెస్ట్‌ హౌస్‌

Written By Mr.D.S on Sunday, November 28, 2010 | 10:44 PM



లిక్కర్‌కింగ్‌, బిజినెస్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో 8.4 మిలి యన్‌ డాలర్లు (రూ.38.4) కోట్లతో సంపన్నులు నివసించే ప్రాంతంలో ఒక ఇల్లు కొనుగోలు చేశారు. 


కేప్‌టౌన్‌లోని ఆ విశాల మైన భవంతిలో హాలీవుడ్‌ స్టార్‌ నికోలస్‌కేజ్‌ కూడా కొన్ని రోజులు గడిపినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. నాలుగు అంతస్థుల ఈ విశాలమైన భవంతి లోపై నుంచి చూస్తే క్లిఫ్‌టన్‌ బీచ్‌ కనిపిస్తోంది. ఈ భవంతిలోనే సౌనాబాత్‌, వాక్‌ ఇన్‌ సేఫ్‌, జిమ్‌తో పాటు నాలుగుకార్లు గారాజ్‌ కూడా ఉంది. 


స్థానిక రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల కథనం ప్రకారం ఈ విశాలమైన భవంతిలో సినిమాతారలు, సింగర్స్‌తో చాలా మంది ఈ భవంతి ఆతిథ్యమిచ్చారు. కేప్‌ టౌన్‌లో ది బెస్ట్‌ హౌజ్‌ ఇదేనంటున్నారు. 

స్వీడన్‌కు చెందిన ప్రిన్స్‌ కార్ట్‌ ఫిలిపి కూడా 2010 ఫిఫా ప్రపంచకప్‌ సందర్భంగా ఈ భవంతిలోనే నివసించారు. పాప్‌సింగర్‌ జార్జ్‌ మైఖేల్‌ గత సంవత్సరం ఇక్కడే నివసించారు.


నికోలస్‌కేజ్‌ ఆయన మూడవ భార్య ఎలైస్‌ కిమ్‌ కూడా ఈ భవంతిలోనే నివసించారు. వారు లార్డ్‌ ఆఫ్‌ వార్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఆరు సంవత్సరాల కిత్రం ఇక్కడ నివసించారు. పై అంతస్తులో ఉన్న పడకగది అద్భుతంగా పెంట్‌హౌస్‌లో ఉన్న అనుభూతి కలుగుతుందని ఈ ప్రాంతంలోని భవనం ఆర్కిటిక్ట్‌ చెప్పారు. ఎలివేటర్‌ (లిఫ్ట్‌) గాజుతో తయారుచేసింది. టైల్స్‌ ఇటలీ నుంచి తెప్పించారని ఆయన పేర్కొన్నారు. 
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger