బ్రిటిష్ టెలికాం దిగ్గజం వోడాఫోను విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మన్నించింది.జరిమానా కింద కోర్టులో చెల్లించాల్సిన మొత్తాన్ని డిమాం డ్ డ్రాఫ్టు రూపంలో కాకుండా బ్యాంకు నుంచి నగదు బదిలీకి ఆమోది ంచింది. ఈ కేసు తదుపరి వాయిదా జులై 19,2011కు వాయిదా వేసి ంది.అంతకు ముందు ఈ కేసును ఫిబ్రవరి 5వ తేదికి కోర్టు వాయివా వే సిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ ఫండ్ ద్వారా నగదు బదిలీ చేయడం తాజాగా అమల్లో జరుగుతున్న తతంగమే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఎస్ హెచ్ కపాడియా వోడాఫోన్ అభ్యర్థనను మన్నించారు.
కంపె నీకి చెందిన న్యాయవాది హరిశ్ సాల్వే న్యాయస్థానంలో వాదిస్తూ కోర్టులో జమ చేయాల్సిన డబ్బు అంతార్జాతీయ ట్రాన్సాక్షన్ ద్వారా జర గాల్సి ఉంది కాబట్టి తాము రూ.2,500 కోట్ల నగదును నేరుగా సుప్రీం కోర్టు బ్యాంకు రిజిష్ట్రార్‌కు ఖాతాలో జమ చేస్తామని, పెద్ద ఎత్తున నగదు జమ చేయాల్సివస్తున్నదని, బ్యాంకు డ్రాప్టు రూపంలో ఖర్చులు పెరిగిపోతా యని, నగదు బదిలీ ద్వారా కొంత మేర డ బ్బు ఆదాచేయవచ్చునని సల్వే చెప్పారు. ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు మన్నిం చింది. రూ.2,500 కోట్ల నగదుతో పాటు జాతీయ బ్యాంకు గ్యారంటీ కూడా ఇవ్వాలని దీనికి గాను 3 నుంచి 8 వారాల సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీని సమయం నవంబర్ 15వ తేదీ నుంచి మొదలవు తుందని కోర్టు తెలిపింది.


Post a Comment