Home » , » కిరణ్ కుమార్ నిగర్వి, మంచి మనిషి: బాలయ్య

కిరణ్ కుమార్ నిగర్వి, మంచి మనిషి: బాలయ్య

Written By Mr.D.S on Friday, November 26, 2010 | 11:19 PM



ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సినీ హీరో, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రశంసించారు. 


నిజాం కళాశాలలో చదువుతున్న రోజుల్లో తన సన్నిహిత మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.


 రాజకీయాలు రాజకీయాలేనని, కిరణ్ కుమార్ రెడ్డి తనకు మంచి మిత్రుడని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిలో మార్పు వస్తుందని తాను అనుకోవడం లేదని, గతంలో మాదిరిగానే స్నేహంగా ఉంటారని అనుకుంటానని ఆయన  అన్నారు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందించారు. కిరణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. 


తాము ఏం చేస్తున్నా పాత జ్ఞాపకాలు అలాగే ఉన్నాయని ఆయన అన్నారు. బేషిజాలు లేకపోవడం తమ ఇద్దరి నైజమని, అలాగే ఉంటామని ఆయన అన్నారు.



నిజాం కళాశాలలో క్రికెటర్ అజరుద్దీన్,బాల కృష్ణ ,ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి చదువుకున్నారు.ప్రస్తుతం వీరు ముగ్గురు రాజకీయాలలో వేరు వేరు పార్టీలలో ఉన్నా ఇప్పటికి వీరందరు స్నేహితులుగానే ఉన్నారు.

అజరుద్దీన్ కాంగ్రెస్ ఎం.పి గా గెలుపొందాడు.బాల కృష్ణ తన తండ్రి స్తాపించిన పార్టీ లోనే  పరోక్ష రాజకీయాలలో ఉన్నారు.అయినప్పటికీ వీరు ఇప్పటికి మంచి స్నేహితులు.






Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger