Home » » వ్యూహాత్మక ‘వివేకం’

వ్యూహాత్మక ‘వివేకం’

Written By Mr.D.S on Thursday, December 2, 2010 | 8:30 PM

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో రాజకీయంగా మాత్ర మే దూరమయ్యానని చెప్పుకుంటున్న వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి వ్యూహాత్మకంగా, శరవేగం గా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌కు చెల్లు చీటీ చెప్పి న కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో రెండు పర్యాయాలు సమావేశం అయిన తర్వాత అధిష్ఠానం ఆదే శిస్తే పులివెందుల స్థానం నుంచి జగన్‌పై అయినా పోటీకి సై అన్న వివేకా, ఆ కోణంలోనే వ్యూహాలు పన్నుతున్నట్టు కనిపిస్తున్నది.

జగన్‌కూ, అధిష్ఠానానికీ సయోధ్య కుదిరి స్తానని, సోనియా వద్దకు జగన్‌ను తీసుకు వెళ్ళి సాక్షి కథ నం, ఇతర పరిణామాలపై విచారం వ్యక్తం చేయిస్తానని ఢిల్లీలో వివేకా ప్రకటించి 24 గంటలు కాకుండానే కాంగ్రె స్‌ పార్టీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేసి, తన తల్లిగారైన పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మతో సైతం జగన్‌ రాజీ నామా చేయించి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ చిన్నాన్నను చేరదీయటం ద్వారా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని జగన్‌ ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 



వ్యూహాత్మక భేటీలు...
YS--Vivekanandఈ పరిణామాలన్నీ వెంట వెంట జరిగిన తర్వాత వివేకా నందరెడ్డి పావులు కదపటం మరింత వేగవంతం చేశారు. తాను మంత్రివర్గంలో చేరుతున్నానని ప్రకటించి, అందు కు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. మంత్రి వర్గంలో చేరటానికి ముందు ఇడుపుల పాయలో ఒకసారి, పులి వెందులలో ఒకసారీ జగన్‌తో భేటీ అయ్యారు. బంధు వులు, కుటుంబ మిత్రుల ఒత్తిడితో ఒకసారి, స్వచ్ఛందం గా మరోసారి సమావేశమై వచ్చారు. మళ్ళీ గురువారం అంటే మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత హైదరాబాద్‌లో మరోసారి జగన్‌ను కలుసుకునేందుకు వెళ్ళారు. ఈ మూ డు పర్యాయాలూ జగన్‌ స్వయంగా ఆహ్వానించకుండానే వివేకా వెళ్ళారు. గురువారం భేటీ ముగిసిన సందర్భంగా జగన్‌ మద్దతుదారుల నిరసనను ఎదుర్కున్న వివేకా ఆగ్రహానికి గురై వారిని గద్దించటంతో పాటు మీసాలు మెలి వేశారు.

తప్పు లేదని చెప్పుకునేందుకే...
ysjజగన్‌ పిలవక పోయినా, వయసులో తానే పెద్ద అయి నా, మూడు పర్యాయాలు ఆయన వద్దకు తనంతట తాను గా వివేకా వెళ్ళటంలో పెద్ద వ్యూహమే ఉందన్నది స్పష్టమ వుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. అవసరం అయితే జగన్‌ పైన సైతం పోటీకి సిద్ధమే అని ఇప్పటికే ప్రకటించిన ఆయన, ఒకవేళ అదే పరిస్థితి సంభవిస్తే తన తప్పు ఏమీ లేదని, తాను స్వచ్ఛందంగా వెళ్ళినా నివాసం ముందే అవ మానించారని ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటూ వోటర్ల సానుభూతి సంపాదించే ప్రయత్నం చేసేందుకే ఈ వ్యూ హంతో ముందుకు పోతున్నారని పార్టీ నేతలు కొందరు అంటున్నారు.

ఒకవేళ జగన్‌నే ఢీకొనాల్సి వస్తే పులి వెందుల నియోజకవర్గంలో అత్యంత కీలకమైన, కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి వోటు బ్యాంకు ఉన్న లింగాల, వేముల మండ లాల్లో జనాన్నంతటినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం వివేకా ఇప్పటినుంచే చేస్తున్నారు. ఈ రెండు మండలా ల్లోనూ వివేకా బంధువులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, రాజకీయాల్లో వేరు పడినంత మాత్రాన కుటుంబంలో కలతలు రేగే అవకాశం లేదని వివేకా పదే పదే చెప్పారు. మరోవైపు జగన్‌ సైతం చిన్నాన్నతో తనకు ఎలాంటి జగడం లేదని, ఆయన అంటే ఎప్పటికీ గౌరవమే అని ప్రకటించారు.

‘వ్యవసాయం’ లో సమస్యల సవాళ్ళు !
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ శాఖలు కేటాయించటంతో వారి వారి శాఖల బాధ్యతలు స్వీకర ణలో మంత్రులు ముహూర్తబలాలు వెతుక్కుంటున్నారు. అయితే వ్యవసాయ మంత్రిత్వ శాఖను చేపట్టిన వైఎస్‌ వివేకానంద రెడ్డి గురువారం క్యాబినెట్‌ సమావేశానికి మందే తనశాఖ కార్యక్రమాలపై ఆరాతీశారు. మంత్రి వివేకా మధ్యాహ్నం నేరుగా బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర వ్యవ సాయశాఖ డైరక్టరేట్‌కు వెళ్ళారు. సుమారు గంటన్నరకు పైగా అక్కడే గడిపారు. వ్యవసాయరంగంలో నెలకొన్న సమస్యలను సవాలుగా స్వీకరించారు.

YS--Vivekananda-Reddyతన అన్న దివంగత ముఖ్యమంత్రి వై ఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యవ సాయ రంగంపట్ల ఎనలేని అసక్తి చూపేవారని, ఆయన పెట్టుకున్న ఆశల, ఆశయాలు నెరవేర్చటమే లక్ష్యంగా పని చేయాలని అధికారులను హెచ్చరించారు. ఏదైనా సమస్యలుంటే తనదృష్టికి నిర్బయంగా తీసుకు రావా లన్నారు. బద్దకంతో ఉన్నవారు దాన్ని వదిలించుకోవా న్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవాలని సూచించారు. వ్యవసాయ కుటంబంనుంచి వచ్చిన తనకు వ్యవసాయరంగంలో ఉన్న సమస్యలు , రైతుల కష్టసుఖాలు తెలుసన్నారు.

రైతుకు పంటలసాగుద్వారా ఆదాయాన్ని పెంచినప్పుడే వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతున్నారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలకు అధికారులు వారి వారి స్థాయిల్లో తక్షణం స్పందిచాలని హెచ్చరించారు. ఉదయం మంత్రి వివేకానందరెడ్డిని అభినందించేందుకు పుష్ప గుచ్చాలతో వెళ్ళిన కొద్దిమంది వ్యవసాయశాఖ సిబ్బందిని ఉద్దేశించి తనవద్దకు ఎవరూ రావద్దని సున్ని తంగా పేర్కొన్నారు. తాను వస్తున్నట్టు ముందుగా ఎవ రికీ చెప్పకుండా ఆకశ్మికంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ డైర క్టరేట్‌కు వెళ్ళారు. మంత్రి వచ్చిన సమాచారాన్ని గమ నించిన కమీషనర్‌ సునిల్‌ శర్మ మంత్రిని తన ఛాంబర్‌ లోకి ఆహ్వానించా
రు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger